రాష్ట్రంలో అరాచకం సృష్టించేందుకు చంద్రబాబు పన్నాగం

16 Jan, 2021 05:07 IST|Sakshi
దీక్షల్లో పాల్గొన్న బహుజన పరిరక్షణ సమితి నాయకులు

బహుజన పరిరక్షణ సమితి నేతల మండిపాటు 

తాడికొండ: రాష్ట్రంలో అరాచకం సృష్టించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని బహుజన పరిరక్షణ సమితి నాయకులు మండిపడ్డారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు జంక్షన్‌లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గురువారం 107వ రోజు, శుక్రవారం 108వ రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. పలువురు ప్రసంగిస్తూ రాష్ట్రం తగలబడిపోవాలని చంద్రబాబు కోరుకుంటున్నారని, ఆయనకు కుర్చీపై ఉన్న ప్రేమ రాష్ట్ర ప్రజలపై లేదన్నారు.

కులాన్ని అడ్డుపెట్టుకుని రాజధాని పేరుతో ఫేక్‌ ఉద్యమాలు చేయిస్తున్నారని ఎద్దేవా చేశారు. పేదలకు రాజ్యాంగబద్ధంగా సంక్రమించాల్సిన మూడు రాజధానులు, రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలు, ఇంగ్లీషు మీడియం విద్యను అడ్డుకుంటున్న చంద్రబాబును వెంటనే అరెస్టు చేసి జైల్లో పెట్టాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సమితి నాయకులు మాదిగాని గురునాథం, నత్తా యోనారాజు, పరిశపోగు శ్రీనివాసరావు, మల్లవరపు సుధారాణి, జూపూడి బాలస్వామి, కొలకలూరి లోకేష్, ఈపూరి ఆదాం, బేతపూడి సాంబయ్య, నూతక్కి జోషి తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు