250వ రోజుకు బహుజన పరిరక్షణ సమితి దీక్ష

5 Jun, 2021 12:02 IST|Sakshi

సాక్షి, గుంటూరు: మందడంలో బహుజన పరిరక్షణ సమితి దీక్ష 250వ రోజుకు చేరుకుంది. అభివృద్ధి వికేంద్రీకరణ, ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం, అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలను టీడీపీ అడ్డుకోవడం నిరసిస్తూ దీక్ష కొనసాగుతోంది. దీక్షకు 643 ప్రజా, మహిళ, ఓసీ, బీసీ, మైనార్టీ, దళిత సంఘాలు మద్దతు తెలిపాయి. 250వ రోజు కొనసాగుతున్న దీక్షలో పలువురు పాల్గొని ప్రసంగించారు. మూడు రాజధానుల విషయంలో ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ పోతుందని ప్రకటించడం హర్షణీయమని బహుజన పరిరక్షణ సమితి నాయకులు అన్నారు.

చదవండి: విషాదం: నాన్నా... ఇది తగునా !..
దారుణం: భార్య చేతిలో భర్త హతం 

మరిన్ని వార్తలు