అమరావతి జేఏసీ వెబినార్‌ అట్టర్‌ ఫ్లాప్‌

1 May, 2021 08:30 IST|Sakshi
రిలే దీక్షల్లో పాల్గొన్న బహుజన పరిరక్షణ సమితి నేతలు

 213వ రోజు దీక్షల్లో బహుజన నాయకుల ఎద్దేవా

తాడికొండ: అమరావతి రాజధాని పేరిట జేఏసీ చేస్తున్న బినామీ దీక్షల వెబినార్‌ అట్టర్‌ఫ్లాప్‌ అయిందని, దాదాపు రూ.500 కోట్లు ఖర్చు పెట్టినా.. 200 మంది కూడా హాజరు కాలేదని బహుజన పరిరక్షణ సమితి నాయకులు ఎద్దేవా చేశారు. గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం తాళ్ళాయపాలెం సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు జంక్షన్‌లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 213వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షల్లో పలువురు నాయకులు ప్రసంగించారు.

ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు భ్రమింపజేస్తూ అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో 500 రోజుల ఉత్సవాలు జరిగాయని, 29 గ్రామాల్లో ప్రజల మద్దతు ఉందంటూ వెబినార్‌లో ఉత్సవాలు నిర్వహించి ఎల్లో మీడియాలో ప్రజలను నమ్మించేందుకు నానా తంటాలు పడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు అమరావతి జేఏసీ పేరిట కుల విభజన చేసి దళితులకు ఓ జేఏసీ,  తన కులస్తులకు మరో జేఏసీ పెట్టి మరోసారి మోసం చేశాడన్నారు. బహుజనులంతా ఏకమై 213 రోజులుగా ఉద్యమం చేస్తుంటే.. దానిని నిర్వీర్యం చేసేందుకు కోర్టులు, వ్యవస్థలను అడ్డుపెట్టుకుని చంద్రబాబు నాటకాలాడడం సిగ్గుచేటన్నారు.

చదవండి: తిరుపతి ఉప ఎన్నికపై పిటిషన్ల కొట్టివేత 
ఏసీబీ కస్టడీకి ధూళిపాళ్ల

మరిన్ని వార్తలు