కులవాదులకు తగిన శాస్తి తప్పదు

20 Aug, 2022 12:22 IST|Sakshi

691వ రోజు దీక్షలో బహుజన పరిరక్షణ సమితి నాయకులు

తాడికొండ: తమకు హక్కులు అందకుండా కుట్ర పన్నుతున్న కులవాదులకు తగిన శాస్తి తప్పదని, కోర్టులో వేసిన తప్పుడు కేసులు ఉపసంహరించుకోపోతే బాబు అండ్‌ కోను రాష్ట్రంలో తిరగకుండా అడ్డుకుంటామని బహుజన పరిరక్షణ సమితి నాయకులు హెచ్చరించారు. మూడు రాజధానులకు మద్దతుగా వారు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం నాటికి 691వ రోజుకు చేరుకున్నాయి. 

పలువురు ప్రసంగిస్తూ, కులవాదమే అజెండాగా కొనసాగుతున్న అమరావతి ఉద్యమంలో టీడీపీ నాయకులు, ప్యాకేజీ పార్టీలు, దళిత దళారులు మినహా ప్రజల మద్దతు లేదన్నారు. అధికారంలో ఉండి భూములిచ్చిన రైతులకు ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా నట్టేట ముంచిన చంద్రబాబును నిలదీయకుండా ఉండేందుకు ముందస్తు ఎత్తుగడతో అమరావతి ఉద్యమం పేరుతో దొంగ దీక్షలకు శ్రీకారం చుట్టడం సిగ్గుచేటన్నారు. 

అరసవెల్లి పేరుతో చందాల యాత్రలకు శ్రీకారం చుట్టిన అమరావతి జేఏసీ నాయకులకు కోట్లాది రూపాయలు ఎక్కడనుంచి అందుతున్నాయో నిఘా వేసి రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు ఎత్తుగడలు వేస్తున్న వారిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. దీక్షలో సమితి నాయకులు గురునాథం, సాంబయ్య, జోషి, ఈపూరి ఆదాం, దాసు తదితరులు పాల్గొన్నారు. (క్లిక్: ఇది అందరికీ గుర్తుండిపోయే ఘట్టం)

మరిన్ని వార్తలు