కరోనా: 21 మంది ఖైదీలకు బెయిల్‌

23 May, 2021 08:07 IST|Sakshi
సెంట్రల్‌ జైలులో బెయిల్‌ దరఖాస్తులను పరిశీలిస్తున్న న్యాయమూర్తులు, జైలు అధికారులు

కరోనా నేపథ్యంలో అధికారుల నిర్ణయం

దరఖాస్తులను పరిశీలించిన న్యాయమూర్తులు

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కరోనా నేపథ్యంలో సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు 21 మంది సెంట్రల్‌ జైలు ఖైదీలకు బెయిల్‌ మంజూరైంది. ఈ వివరాలను రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు సూపరింటెండెంట్‌ రాజారావు శనివారం తెలిపారు. బెయిల్‌కు సెంట్రల్‌ జైలు నుంచి మొత్తం 45 మంది ఖైదీలు దరఖాస్తు చేసుకున్నారు.

వారి కేసు ల పూర్వాపరాలను ఇద్దరు న్యాయమూర్తులు జైలు కు వెళ్లి పరిశీలించి, 21 మందిని అర్హులుగా తేల్చా రు. వీరిలో నలుగురు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు కాగా, 17 మంది రిమాండ్‌లో ఉన్నారు. ఏడేళ్ల లోపు శిక్ష పడిన ఖైదీలకు మాత్రమే ఈ అవకాశం ఇచ్చా రు. ఈ 21 మంది ఖైదీలూ ఆదివారం ఉదయం విడుదల కానున్నారు. వీరందరినీ 90 రోజులు బెయిల్‌పై విడుదల చేస్తున్నారు. రిమాండ్‌ ఖైదీలు తిరిగి ఆగస్ట్‌ 19న కోర్టులో లొంగిపోవాలి. శిక్ష పడిన ఖైదీలు నేరుగా జైలుకు వచ్చి లొంగిపోవాలి.

కాకినాడ స్పెషల్‌ సబ్‌జైలులో ఏడుగురు..
కాకినాడ లీగల్‌: ఏడుగురు రిమాండ్‌ ఖైదీలను తాత్కాలిక బెయిల్‌పై విడుదల చేసినట్టు కాకినాడ స్పెషల్‌ సబ్‌ జైల్‌ సూపరింటెండెంట్‌ జి.రవికుమార్‌ శనివారం తెలిపారు. కాకినాడ నాలుగో అదనపు మెజిస్టేట్‌ సత్యకాంత్‌ కుమార్, మొబైల్‌ మెజి్రస్టేట్‌ జానకి సబ్‌ జైలుకు వెళ్లి అర్హులైన ఏడుగురు ముద్దాయిల నుంచి సొంత పూచీకత్తు తీసుకున్నారు. ముద్దాయిలను విడుదల చేయాలని సబ్‌ జైలు సూపరింటెండెంట్‌కు సూచించారు.

చదవండి: ‘యాస్‌’ తుపాను కారణంగా పలు రైళ్లు రద్దు  
కరోనా ఆయుర్వేద మందుపై శాస్త్రీయ అధ్యయనం

మరిన్ని వార్తలు