సెంట్రల్‌ డిస్కం వెబ్‌సైట్, యాప్‌ ప్రారంభం

7 Jan, 2021 05:34 IST|Sakshi
వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తున్న మంత్రి బాలినేని

ఒంగోలు: సెంట్రల్‌ డిస్కం నూతనంగా అభివృద్ధి చేసిన శాప్‌ అండ్‌ ఐటీ అప్లికేషన్, వెబ్‌సైట్‌ను రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. బుధవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో బాలినేని మాట్లాడుతూ.. సెంట్రల్‌ డిస్కం అధునాతన సాంకేతిక విలువలతో వినియోగదారులకు సత్వర సేవలందించే దిశగా ముందుకెళ్లడం అభినందనీయమన్నారు. 2019 డిసెంబర్‌లో సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల ప్రజలకు, వినియోగదారులకు మరింత మేలు జరిగేలా ఏపీఎస్పీడీసీఎల్‌ను విభజించి ఏపీసీపీడీసీఎల్‌ను  ఏర్పాటు చేశామన్నారు.

డిసెంబర్‌ 28 నుంచి కొత్తగా ఏర్పడ్డ సెంట్రల్‌ డిస్కం సొంతంగా కార్యకలాపాలు ప్రారంభించిందన్నారు. నేడు ప్రారంభించిన అప్లికేషన్‌ ద్వారా సెంట్రల్‌ డిస్కంలోని ఉద్యోగుల దైనందిన కార్యకలాపాలను పారదర్శకతతో చేయడానికి వీలవుతుందన్నారు. అత్యుత్తమ, నాణ్యమైన, కచి్చతమైన సమాచారం ఉంటుందని, ఏ సమయంలో అయినా అందుబాటులో ఉండటం వల్ల ఉద్యోగులకు, వినియోగదారులకు సౌకర్యంగా ఉంటుందన్నారు.  

>
మరిన్ని వార్తలు