సంక్షోభాన్ని అధిగమిస్తాం : మంత్రి బాలినేని

14 Oct, 2021 03:38 IST|Sakshi

సాక్షి, అమరావతి: విద్యుత్‌ రంగం గతంలోనూ అనేక సంక్షోభాలు ఎదుర్కొన్నప్పటికీ, ఎన్నడూ వెనకడుగు వేయలేదని, బొగ్గు సంక్షోభం తాత్కాలికమేనని ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. ప్రభుత్వ సహకారంతో, వినియోగదారుల మద్దతుతో ఈ సంక్షోభాన్ని తప్పకుండా అధిగమిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని రైతులు, వినియోగదారులు, విద్యుత్‌ రంగ ఉద్యోగులు, సిబ్బందికి విజయ దశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మంత్రి బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

తీవ్ర బొగ్గు కొరత ఉన్నప్పటికీ తక్కువ అంతరాయాలతో, కొంత లోడ్‌ రిలీఫ్‌ చర్యలతో వినియోగదారులకు విద్యుత్‌ను నిరంతరాయంగా అందించేందుకు కృషి చేస్తున్న ఇంధన శాఖ అధికారులను మంత్రి అభినందించారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు