అదిరే.. ఆవు దూడకు బాలసారె..

16 Jun, 2022 18:37 IST|Sakshi

కాకినాడ రూరల్‌: కాకినాడ రమణయ్యపేటలో వైద్యుడు గౌరీశేఖర్‌ బుధవారం ఆవుదూడకు బాలసారె మహోత్సవాన్ని నిర్వహించారు. ఆయన భార్య రమాదేవి, ఇద్దరు కుమార్తెలు  వైద్యులుగానే స్థిరపడ్డారు. అల్లుళ్లు కూడా వైద్యులే. ఇంటిలోనే ఆస్పత్రిని నిర్వహిస్తున్న గౌరీశేఖర్‌కు చిన్నప్పటి నుంచి ఆవులంటే మక్కువ ఎక్కువ. ఇటీవల సుమారు రూ.50 వేలకు పుంగనూరు జాతి ఆవుదూడను కొన్నారు. దానికి మూడో నెల రావడంతో బుధవారం బంధుమిత్రులందరినీ పిలిచి బాలసారె వేడుకగా నిర్వహించారు. ఆవుదూడకు పట్టీలు అలంకరించి పూజలు అనంతరం ఊయలలో ఉంచి ఊపుతూ మంత్రోచ్చరణ చేయించి, ఆశీర్వచనలు ఇచ్చారు. అడబాల ట్రస్టు ఆధ్వర్యంలో ఆయనను సన్మానించారు.

మరిన్ని వార్తలు