‘బీసీ రిజర్వేషన్‌ వల్ల కాపులకు ఉపయోగం లేదు’

24 Dec, 2022 16:58 IST|Sakshi

అమరావతి:  బీసీ రిజర్వేషన్‌ వల్ల కాపులకు ఉపయోగం లేదని తమిళనాడు మాజీ సీఎస్‌ రామ్మోహనరావు కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో బీసీ రిజర్వేషన్‌ కోసం పోరాటం చేయొద్దని తాను చెప్పిన విషయాన్ని మరోసారి ప్రస్తావించారు రామ్మోహనరావు. కాపు ఉద్యోగుల సంక్షేమ సంఘం క్యాలెండర్‌, డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో రామ్మోహనరావు ఈ వ్యాఖ్యలు చేశారు.

‘ బీసీ రిజర్వేషన్‌ అనేది కాపుల సంక్షేమానికి కంటితుడుపు చర్యే తప్ప.. సామాజికంగా ఎటువంటి ప్రయోజనం లేదు. రాజకీయాల వల్ల కాపు అనే కులం డైవర్ట్‌ అయ్యింది. కాపు రిజర్వేషన్‌ ఉద్యమం వల్ల బీసీలకు కాపులు దూరమవుతున్నారు. రాష్ట్రంలో  ఏ ‍ప్రభుత్వం అధికారంలో ఉన్నా కాపులకు బీసీ రిజర్వేషన్‌ సాధ్యం కాదు. తునిలో పెట్టిన బీసీ రిజర్వేషన్‌ సభతో కాపులను అల్లరి మూకలుగా ముద్ర వేశారు. ఒకే సామాజికి వర్గానికి చెందిన వారు ఏపీ నుంచి ముగ్గురు సుప్రీం కోర్టు జడ్జిలయ్యారు. వారికేమీ రిజర్వేషన్లు లేవు’ అని వ్యాఖ్యానించారు రామ్మోహనరావు.

మరిన్ని వార్తలు