సీఎం జగన్‌ చరిత్రలో నిలిచిపోతారు

1 Nov, 2020 04:23 IST|Sakshi

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య 

నెహ్రూనగర్‌(గుంటూరు)/చిలకలూరిపేట: రాష్ట్రంలో ఉన్న 139 బీసీ కులాలను గుర్తించి వాటికి అనుగుణంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చైర్మన్లను నియమించడం ద్వారా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని, బీసీ కులాలన్నీ ఆయనకు రుణపడి ఉంటాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య తెలిపారు. బీసీల సమస్యలపై తాను వివిధ రాష్ట్రాల్లో పోరాడుతున్నానని, అయితే ఏపీలో బీసీల సమస్యలపై పోరాడేందుకు ఎలాంటి అవకాశం కలగట్లేదని, సంస్కరణవాది అయిన వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండటమే అందుకు కారణమని అన్నారు.

ఈ మేరకు శనివారం గుంటూరు, చిలకలూరిపేటల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. ఆనాడు మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి బీసీలపై చిత్తశుద్ధితో వ్యవహరించారని, ఈనాడు ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి ఒక అడుగు ముందుకేసి బీసీలకు అగ్రతాంబూలం ఇచ్చారని ప్రశంసించారు. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ..ఇచి్చన మాటకు కట్టుబడి సీఎం జగన్‌ బీసీలకు 56 కార్పొరేషన్లు ఇవ్వడం గర్వకారణమన్నారు.

చిలకలూరిపేట వ్యవసాయ మార్కెట్‌ యార్డులో కార్పొరేషన్‌ చైర్మన్లకు జరిగిన సన్మాన కార్యక్రమానికి ఎమ్మెల్యే విడదల రజని అధ్యక్షత వహించి మాట్లాడారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు, ఎంపీలు మోపిదేవి వెంకటరమణారావు, శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారథి, జోగి రమే‹Ù, మేరుగ నాగార్జున, అంబటి రాంబాబు, మద్దాళి గిరిధర్,  మద్యపాన విమోచన సమితి అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి, పలువురు బీసీ కార్పొరేషన్‌ చైర్మన్లు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు