బాబోయ్‌ భల్లూకం: ఎలుగుబంట్ల హల్‌చల్‌

7 May, 2021 07:03 IST|Sakshi
చినవంక ఆలయం వద్ద ఎలుగు (ఫైల్‌)- తీరంలో ఎలుగుబంట్లు..

పసన, జీడి తోటలు, తీర ప్రాంతాల్లో ఎలుగుబంట్లు సంచారం

భయాందోళనలో రైతులు, మత్స్యకారులు 

వజ్రపుకొత్తూరు రూరల్‌: ఉద్దానం, తీర ప్రాంతాల్లో గత కొద్ది కాలంగా ఎలుగు బంట్లు (భల్లూకాలు) హల్‌చల్‌ చేస్తుండంతో ప్రజలు భయందోళన చెందుతున్నారు. ప్రధానంగా మందస, వజ్రపుకొత్తూరు, పలాస మండలాల్లోని పలు గ్రామాల్లో ఉన్న జీడి తోటలు, సముద్ర తీరాల్లో సంచరిస్తున్నాయి. ప్రస్తుతం జీడి పిక్కలను ఎరేందుకు రైతులు తోటల్లోనే ఎక్కువ సమయం ఉంటున్నారు. దీంతో ఏ సమయంతో ఏ ప్రమాదం జరుగుతుందోనని భయాందోళన చెందుతున్నారు.

అనేక మందికి గాయాలు..  
ఇప్పటికే అనేక మందిపై ఎలుగులు దాడిచేసి గాయపరిచాయి. చికిత్స పొందుతూ క్షతగాత్రులు పదుల సంఖ్యలో మృతి చెందారు.  
మూడేళ్ల క్రితం తాడివాడ వద్ద రైతులు పంట రక్ష ణకు ఏర్పాటు చేసుకున్న కంచెలో ఎలుగు చిక్కింద
రెండేళ్ల క్రితం చినవంక గ్రామ దేవత ఆలయంలో ఎలుగు చొరబడింది.
అక్కుపల్లిలో కిరాణా దుకాణంపై దాడిచేశాయి.  
 రాజాంలో అంగన్‌వాడీ కేంద్రంలో ఎలుగులు చొరబడి నూనె, పప్పు, ఇతర నిత్యావసర సరుకుల ను ధ్వంసం చేశాయి.   
డెప్పూరులో రాత్రి సమయంలో గ్రామ వీధుల్లో సంచరించి ప్రజలకు ప్రాణభయం కలిగించాయి.  
​​​​​కిడిసింగిలో నిర్మాణం జరుగుతున్న ఇంటిలో రెండు ఎలుగులు కనిపించడంతో భవన నిర్మాణ కార్మికులు బయటకు పరుగులు తీశారు.  
గత మూడు రోజుల నుంచి డోకులపాడు సము ద్ర తీరంలో రెండు ఎలుగులు సంచరిస్తూ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అధికారు లు స్పందించి ఎలుగుల సంచారాన్ని నియంత్రించా లని ఉద్దాన, తీర ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు.   

తీరంలో ఎలుగుబంట్లు..  
వజ్రపుకొత్తూరు: మండలంలోని ఉద్దాన తీరప్రాంత గ్రామాల్లో ఎలుగుబంట్లు భయాందోళన కు గురిచేస్తున్నాయి. బుధ, గురువారాల్లో  డోకు లపాడు తీర ప్రాంతంలో రెండు ఎలుగుబంట్లు సంచరించడంతో జీడి రైతులు ఆందోళనకు గురయ్యారు.

ఒంటరిగా తిరగొద్దు  
ప్రస్తుత సీజన్‌లో పనస, జీడి పండ్లు తీనేందుకు ఎలుగులు తోటల్లో సంచరిస్తా యి. తోటలకు వెళ్లేటప్పు డు, రాత్రి సమయంతో ఆరు బయటకు వచ్చేటప్పుడు ఒంటరిగా రావొ ద్దు. ఎలుగులను కవ్వించకూడదు. వాటి సంచారాన్ని గమనిస్తూ పలు జాగ్రత్తలు పాటించాలి. ఇప్పటికే ప్రజలకు అవగాహన కల్పించాం.  
– రాజనీకాంతరావు, ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్, కాశీబుగ్గ రేంజ్‌

చదవండి: 
సీసీ ఫుటేజ్‌లో దృశ్యాలు: పావు గంటలో.. పని కానిచ్చేశారు!  
కొడుకును బావిలో పడేసి...ఆపై తండ్రీ ఆత్మహత్య 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు