మంచుతెరలు.. సూర్యోదయం అందాలు అదుర్స్‌.. ఎక్కడంటే!

2 Sep, 2022 19:48 IST|Sakshi

సాక్షి, అరకు(అల్లూరి సీతారామరాజు జిల్లా): ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు – అనంతగిరి ఘాట్‌మార్గంలో గాలికొండ వ్యూపాయింట్‌ వద్ద ప్రకృతి అందాలు మంత్ర ముగ్ధులను చేస్తున్నాయి.


గురువారం ఉదయం తరలివచ్చిన పర్యాటకుల సెల్‌ఫోన్ల వీటిని బంధించారు. మలుపుల వద్ద మంచు అందాలను తిలకించి పులకించిపోయారు.             


వంజంగి హిల్స్‌లో మంచుతెరలు

పాడేరు : మేఘాలు, మంచు అందాల నిలయంగా విశ్వవ్యాప్తి పొందిన పాడేరు మండలం వంజంగి హిల్స్‌లో గురువారం ప్రకృతి కనువిందు చేసింది.


అనేక ప్రాంతాలకు చెందిన పర్యాటకులు బుధవారం రాత్రే వంజంగి హిల్స్‌కు చేరుకుని కల్లాలబయలు, బోనంగమ్మ పర్వతంపై గుడారాలు వేసుకుని బస చేసారు.


తెల్లవారుజాము 4.30 గంటల సమయంలో సూర్యోదయం అందాలు పర్యాటకులను అబ్బురపరిచాయి.


కొండల నిండా మంచు నెలకొనడంతో ఇక్కడ ప్రకృతి రమ్యతను చూసి పర్యాటకులంతా మంత్రముగ్ధులయ్యారు. ఉదయం పది గంటల వరకు మంచుతెరలు ఆకట్టుకున్నాయి. (క్లిక్‌: అందమైన పెళ్లికి ఆదివాసీలే పేరంటాలు)

మరిన్ని వార్తలు