జాతీయ లక్ష్యానికి చేయూతనివ్వాలి..

27 Feb, 2023 04:39 IST|Sakshi

ఏపీని కోరిన బీఈఈ డైరెక్టర్‌ జనరల్‌ అభయ్‌ బాక్రే

సాక్షి, అమరావతి : ఇంధన పొదుపు, సామర్థ్యంలో చురుకైన పాత్ర పోషిస్తున్న ఏపీ.. జాతీయ లక్ష్యానికి మరింత చేయూతనివ్వాల్సిందిగా బీఈఈ డైరెక్టర్‌ జనరల్‌ అభయ్‌ బాక్రే కోరారు. మార్చి 1న న్యూఢిల్లీలోని ఇండియన్‌ హాబిటాట్‌ సెంటర్‌లో జరగనున్న బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియెన్సీ(బీఈఈ) 21వ వ్యవస్థాపక దినోత్సవాలకు రాష్ట్రాన్ని ఆహ్వానించారు.

ఈ మేరకు స్టేట్‌ డిజిగ్నేటెడ్‌ ఏజెన్సీ(ఎస్డీఏ)గా ఉన్న ఏపీ స్టేట్‌ ఎనర్జీ కన్జర్వేషన్‌ మిషన్‌(ఏపీఎస్‌ఈసీఎం)కు సమాచారం అందించడం కోసం బాక్రే ఆదివారం వర్చువల్‌ సమావేశం నిర్వహించారు. 2030 నాటికి ఏపీలో 6.68 మిలియన్‌ టన్నుల చమురుకు సమానమైన(ఎంటీవోఈ) ఇంధనాన్ని ఆదా చేయాలనే లక్ష్యాన్ని చేరుకునే కార్యక్రమాల అమలును వేగవంతం చేయాలని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, ఏపీఎస్‌ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డిని బాక్రే కోరారు.  

మరిన్ని వార్తలు