మలబార్‌ సీఫేజ్‌ విన్యాసాలు ప్రారంభం

27 Aug, 2021 04:07 IST|Sakshi
యుద్ధ నౌకల విన్యాసాలు

గువాన్‌ సముద్ర జలాల్లో సత్తా చాటిన భారత యుద్ధ నౌకలు 

సాక్షి, విశాఖపట్నం: ప్రతిష్టాత్మక 25వ మలబార్‌–2021లో సీఫేజ్‌ విన్యాసాలు గురువారం ప్రారంభమయ్యాయి. అమెరికాలోని గువాన్‌ సముద్ర జలాల్లో నాలుగు దేశాలు సంయుక్తంగా ఈ విన్యాసాల్లో తమ సత్తా చాటాయి. భారత నౌకాదళంతో పాటు యునైటెడ్‌ స్టేట్స్‌ నేవీ (యూఎస్‌ఎన్‌), జపాన్‌ మారిటైమ్‌ సెల్ఫ్‌డిఫెన్స్‌ ఫోర్స్‌(జేఎంఎస్‌డీఎఫ్‌)తో పాటు రాయల్‌ ఆస్ట్రేలియన్‌ నేవీ (ఆర్‌ఏఎన్‌) నౌకాదళం ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి.

ఈ విన్యాసాల్లో భారత యుద్ధనౌకలు ఐఎన్‌ఎస్‌ శివాలిక్, ఐఎన్‌ఎస్‌ కద్మత్‌తో పాటు పీ8ఐ ఎయిర్‌క్రాఫ్ట్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.  పీ8 ఎయిర్‌క్రాఫ్ట్‌ విన్యాసాలు, యాంటీ సబ్‌ మెరైన్‌ వార్‌ఫేర్‌ ఆపరేషన్స్, క్రాస్‌డెక్‌ ల్యాండింగ్స్, సీమ్యాన్‌ షిప్‌ విన్యాసాలు, వెపన్‌ ఫైరింగ్‌తో నౌకాదళాలు సత్తా చాటాయి. ఈస్ట్రన్‌ ఫ్లీట్‌ కమాండింగ్‌ ఫ్లాగ్‌ ఆఫీసర్‌ రియర్‌ అడ్మిరల్‌ తరుణ్‌సోబ్తి నేతృత్వంలో భారత బృందాలు విన్యాసాల్లో పాల్గొన్నాయి. ఈ నెల 29వ తేదీతో మలబార్‌ విన్యాసాలు ముగియనున్నాయని నౌకాదళ వర్గాలు వెల్లడించాయి.  

మరిన్ని వార్తలు