దేవుడు వర్షాలు కురిపిస్తుంటే.. జగనన్న సంక్షేమ పథకాలు ఇస్తున్నారు

7 Oct, 2021 14:13 IST|Sakshi

సాక్షి, ప్రకాశం జిల్లా: దేవుడు వర్షాలు కురిపిస్తుంటే.. జగనన్న సంక్షేమ పథకాలు ఇస్తున్నారని డ్వాక్రా మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో రెండో విడత ’వైఎస్సార్‌ ఆసరా’ కార్యక్రమంలో లబ్ధిదారులు మాట్లాడుతూ ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల పట్ల సంతోషం వ్యక్తం చేశారు. (చదవండి: రెండో విడత ‘వైఎస్సార్‌ ఆసరా’ ప్రారంభించిన సీఎం

మాట నిలబెట్టుకున్నారు...
డ్వాక్రా మహిళ స్వాతి మాట్లాడుతూ, సీఎం జగనన్న ఇచ్చిన మాటనిలబెట్టుకున్నారని.. అర్హత ఉన్న ప్రతి మహిళకు సంక్షేమ పథకాన్ని అందించారన్నారు. దేవుడు వర్షాలు కురిపిస్తుంటే.. జగనన్న సంక్షేమ పథకాలు ఇస్తున్నారన్నారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తన పుట్టినిల్లుగా మారి ప్రతి కష్టాన్ని తీర్చిందన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌కు ఆమె ధన్యవాదాలు తెలిపింది.

తండ్రికి తగ్గ తనయుడు..
ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలానికి చెందిన మహిళ అశ్విని మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంలో చాలా కష్టాలు పడ్డామన్నారు. రుణమాఫి చేస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశారన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారన్నారు. సీఎం జగన్‌ చెప్పినవి, చెప్పవని కూడా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా సీఎం జగన్‌ నిరూపించుకుంటున్నారన్నారు.

రెండో విడత ’వైఎస్సార్‌ ఆసరా’ కార్యక్రమంలో మంత్రులు మాట్లాడుతూ...
బాబు హయాంలో ప్రకాశం జిల్లా అభివృద్ధి శూన్యం..
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తి సీఎం వైఎస్‌ జగన్‌ అని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. చంద్రబాబు హయాంలో ప్రకాశం జిల్లా అభివృద్ధి శూన్యమన్నారు.

సీఎం జగన్‌ చరిత్రలో నిలిచిపోతారు..
ఇచ్చిన మాట నిలబెట్టుకుని సీఎం జగన్‌ చరిత్రలో నిలిచిపోతారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. గత ప్రభుత్వం డ్వాక్రా మహిళలను మోసం చేసిందన్నారు. సీఎం జగన్‌కు అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు అన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ మహిళా పక్షపాతి అని మంత్రి సురేష్‌ అన్నారు.

ఆ ఘనత సీఎం జగన్‌దే..
మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఘనత సీఎం జగన్‌దేనని రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. గత ప్రభుత్వం బకాయిలను సీఎం జగన్‌ ప్రభుత్వం చెల్లిందన్నారు. బాబు హయాంలో డ్వాక్రా మహిళలు అప్పుల్లో కూరుకుపోయారన్నారు. నాడు బాబు వస్తే జాబొస్తుందన్నారని.. కానీ ఉన్న ఉద్యోగాలు తీసేశారని మంత్రి గుర్తు చేశారు.

మరిన్ని వార్తలు