శనగ ఎన్‌బీఈజీ–452 విత్తనం విడుదల

3 Sep, 2022 14:38 IST|Sakshi
నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ కేంద్రంలో సాగులో ఉన్న ఎన్‌బీఈజీ–452 రకం శనగ

నంద్యాల(అర్బన్‌): శనగలో ఎన్‌బీఈజీ–452 అనే కొత్త రకం విత్తనం విడుదలైందని నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ జయలక్ష్మి తెలిపారు. స్థానిక పరిశోధన స్థానం కార్యాలయంలో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ జేజీ–11కు ప్రత్యామ్నాయంగా ఎన్‌బీఈజీ–452 రకాన్ని విడుదల చేశామని చెప్పారు. 

ఈ రకం ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల వరకు దిగుబడి ఇస్తుందన్నారు. ఎండు తెగులును తట్టుకుంటుందన్నారు. ఇది గింజ నాణ్యతలో జేజీ–11ను పోలి ఉంటుందని పేర్కొన్నారు. నాణ్యమైన ఫౌండేషన్, టీఎల్‌ విత్తనాలను నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో పొందవచ్చని ఆమె తెలిపారు.

టీఎల్‌ విత్తనం ధర కిలో రూ.95 ఉండగా, ఫౌండేషన్‌ విత్తనం కిలో రూ.100 చొప్పున లభిస్తుందని చెప్పారు. విత్తనాల కోసం రామరాజు (9866884486), లోకేశ్వరరెడ్డి (9996477936)ని సంప్రదించాలని సూచించారు. (క్లిక్‌: ప్రాణం పోసుకుంటున్న నల్ల రాతి శిలలు!)

మరిన్ని వార్తలు