అరుదైన వ్యాధికి వైద్యం.. శిశువుకు ప్రాణం

11 Sep, 2021 11:26 IST|Sakshi
శిశువును తల్లిదండ్రులకు అందిస్తున్న డాక్టర్‌ సాయి సునీల్‌కిశోర్‌ తదితరులు  

విశాఖ మెడికవర్‌ ఉమెన్‌ అండ్‌ చైల్డ్‌ ఆస్పత్రి వైద్యుల ఘనత 

బీచ్‌రోడ్డు(విశాఖ తూర్పు) : కోవిడ్‌తో పాటు మల్టీ సిస్టమ్‌ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌ ఇన్‌ చిల్డ్రన్‌–మిస్క్‌(ఎంఐఎస్‌–సీ)తో బాధపడుతున్న 900 గ్రాముల బరువైన శిశువుకు మెరుగైన వైద్యం అందించి వ్యాధిని నయం చేశారు. దక్షిణ భారతదేశంలో ఈ వ్యాధి నుంచి కోలుకున్న అతి చిన్న శిశువుగా వైద్యులు పేర్కొన్నారు. విశాఖలోని మెడికవర్‌ ఉమెన్‌ అండ్‌ చైల్డ్‌ ఆస్పత్రి వైద్యులు ఈ ఘనత సాధించారు. ఆస్పత్రిలో గురువారం ఈ కేసు వివరాలను చీఫ్‌ నియోనాటాలజిస్ట్‌ డాక్టర్‌ సాయి సునీల్‌కిశోర్‌ మీడియాకు వెల్లడించారు. విశాఖకు చెందిన తేజస్వి గర్భంలోని బిడ్డ ఎదుగుదల, రక్త సరఫరా సరిగా లేకపోవడంతో సిజేరియన్‌ చేశారు. ఆడ శిశువుకు జన్మనిచ్చింది. (చదవండి: సాయి తేజ్ యాక్సిడెంట్‌.. సీసీ టీవీ పుటేజీ వీడియో వైరల్‌

అయితే ఆ శిశువు కేవలం 900 గ్రాముల బరువే ఉండటంతో ఆరోగ్యం విషమంగా మారింది. మెరుగైన చికిత్స కోసం మెడికవర్‌ ఆస్పత్రికి తీసుకొచ్చారు. శిశువు ఎడమ కాలులో ఇస్కీమిక్‌ మార్పుల వలన రక్త సరఫరా నిలిచినట్టు గుర్తించారు. శిశువు కోవిడ్‌తో పాటు ఎలివేటెడ్‌ ఇన్‌ఫ్లమేటరీ మార్కర్‌లను కలిగి ఉన్నట్టు వైద్య పరీక్షల్లో తేలింది. అతి చిన్న వయసులో ఇలాంటి పరిస్థితి రావడం అరుదు. ఇంక్యుబేటర్‌లో ఉన్న శిశువుకు మూడు రోజులు అత్యాధునిక వైద్యం అందించారు. 36 రోజుల అత్యవసర చికిత్స అనంతరం శిశువు సాధారణ స్థితికి చేరుకోవడంతో గురువారం తల్లిదండ్రులకు అప్పగించారు. (చదవండి: నిరాడంబరతకు ఆయనో నిలువుటద్దం)

మరిన్ని వార్తలు