మేమున్నామని.. మీకేం కాదని 

30 Jul, 2020 07:47 IST|Sakshi
108 వాహనంలో గర్భిణికి ప్రసవం చేయించిన సిబ్బంది (ఫైల్‌)

ఏజెన్సీలో 104, 108 సేవలు విస్తృతం

సబ్‌ప్లాన్‌ పరిధిలోని నియోజకవర్గాలకు మహర్దశ

తొలి విడతలో 11 నూతన వాహనాలు

మరో 15 ఫీడర్‌ అంబులెన్స్‌లతో వైద్యసేవలు  

పాలకొండ రూరల్‌/సీతంపేట: వైద్యం లేక అల్లాడిపోతున్న గిరిజన ప్రాంతాలకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కొత్త ఊపిరి అందించారు. అపర సంజీవనిగా పేరుగాంచిన 108, 104 సేవలను ఏజెన్సీలో విస్తృతం చేస్తూ నిర్ణయం తీసుకు న్నారు. ఆంధ్రా ఒడిశా సరిహద్దు నియోజకవర్గాలైన పాలకొండ, పాతపట్నం, పలాస, టెక్కలి, నరసన్నపేట పరిధిలో 24 గంటలు వైద్య సేవలను అందించే 27 పీహెచ్‌సీలున్నాయి. అలాగే ఆరోగ్య ఉప కేంద్రాలు 151, ఏరియా ఆస్పత్రులు 2, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు 3 ఉన్నాయి. వీటికి సంబంధించి ఐటీడీఏ ప్రత్యేక అంబులెన్స్‌లు 11 అందుబాటులో ఉన్నాయి. గత టీడీపీ హయాంలో ఏజెన్సీ మండలాల్లో వైద్య సేవలు అంతంతమాత్రంగానే అందేవి. దీనికి తోడు అప్పట్లో 108, 104 వాహనాలకు డీజిల్‌ లేక అవి మూలనపడ్డాయి. సిబ్బందికి అరకొర జీతాలతో వారూ ది గాలుగా ఉండేవారు. దీన్ని గుర్తించిన వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం పరిస్థితులను సమూలంగా మా ర్చివేసింది. ముఖ్యంగా ఏజెన్సీ సబ్‌ప్లాన్‌ పరిధిలో మెరుగైన వైద్య సేవలకు శ్రీకా రం చుట్టింది. 

ఏజెన్సీలో మెరుగైన వైద్య సేవలు 
ఐటీడీఏ సబ్‌ప్లాన్‌ పరిధిలో ఉన్న గిరిజన గ్రామాలకు మెరుగైన వైద్య సేవలందించడ మే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనికి అనుగుణంగా సీతంపేట, పాలకొండ మండల కేంద్రాల్లో అ త్యాధునిక హంగులతో ప్రత్యేక ఆస్పత్రుల నిర్మాణాలకు సంబంధించి నిధులు సమకూర్చేందుకు పచ్చజెండా ఊపింది. తాజాగా 104, 108 వాహనాలను కూడా సమకూర్చింది. 2011 నుంచి ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో తిరుగుతున్న  వాహనాలు 5 లక్షల కిలోమీటర్లు దాటి ప్రయాణాలు కొనసాగించటంతో నిబంధనల మేరకు ఆ వాహనాలు జీర్ణించుకుపోయాయి. ఈ క్రమంలో జిల్లా పరిధిలో ఏజెన్సీ గ్రామాలను కలుపుకుని ఉన్న సమీప మండలాలైన పాలకొండ, మందస, పాతపట్నం, కొత్తూరు, సీతంపేట, మెళియాపుట్టి, ఎల్‌.ఎన్‌ పేట, సావరకోట, హిరమండలం మండలాలకు ప్రత్యేకంగా సరికొత్త వాహనాలను తొలివిడతలోనే అందించారు. వీటికి తోడు మరో 15 ఫీడర్‌ అంబులెన్స్‌లు గిరిగ్రామాల్లో చక్కర్లు కొడుతూ సేవలు ముమ్మరం చేస్తున్నాయి. ఈ కోవలో భామిని, వీరఘట్టం మండలాలకు త్వరలో నూతన వాహనాలు సమకూరనున్నాయి.  

అత్యాధునిక వైద్య సేవలు 
నూతన అంబులెన్స్‌లో ప్రభుత్వం అధునాతన వైద్య సేవలకు సంబంధించిన పరికరాలను అమర్చింది. పల్స్‌ఆక్సీ మీటర్, ఫోల్టబుల్‌ స్ట్రెక్చర్స్, ట్రాన్స్‌పోర్టు వెంటిలేటర్, సాక్షన్‌ ఆపరేటర్, మల్టీ పారామీటర్, కెమెరా, మొబైల్‌ డేటా టెర్మినల్‌(ఎండీటీ) ప్రతి పౌరునికీ ఎలక్ట్రానిక్‌ హెల్త్‌ రికార్ట్స్‌ నమోదు వంటి సేవలు అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రమాదం జరిగిన వెంటనే గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 20 నిమిషాల్లోనే 108 వాహనం రానుంది. ప్రతి అంబులెన్స్‌ను ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ సెంటర్‌(ఈఆర్సీ)కి అనుసంధానం చేశారు. మొబై ల్‌ మెడికల్‌ యూనిట్‌లలో ఒక వైద్యాధికారి, డేటా ఎంట్రీ ఆపరేటర్, డ్రైవర్, ఏఎన్‌ఎం ఆశ కార్యకర్త ఉంటారు. సాధారణ సమస్యలతోపాటు ప్రస్తుతం కరో నా వైరస్‌ బారిన పడుతున్న వారికి సేవలందించటంలో కూడా 108 తోడ్పడుతుంది. జిల్లావ్యాప్తంగా ఉన్న 30 వాహనాల్లో 20 వాహనాలు కోవిడ్‌ బాధితుల సేవలకు కేటాయించారు.  

రెట్టించిన ఉత్సాహంతో.. 
ఇక సిబ్బంది విషయానికి వస్తే 108, 104 వాహన పైలెట్స్‌కు రూ.18 వేల నుంచి రూ.28 వేలు, ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్‌కు(ఈఎంటీలు) గతంలో రూ.12 వేలు ఇచ్చేవారు. ప్రస్తుతం వారి సర్వీసును బట్టి రూ.20వేలు నుంచి రూ.30 వేలకు జీతాలు పెంచారు. జీతాల పెంపు పై 108, 104 వాహన సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. రెట్టించిన ఉత్సాహంతో విధులు చేపడుతుండటం విశేషం.

ఉత్సాహంగా పనిచేస్తాం 
ముఖ్యమంత్రి 108, 104 వాహన సేవలకు కొత్త ఊపిరి అందించారు. గతంలో కనీసం డీజిల్‌ లేక నెలల తరబడి వాహనాలు మూలనపడ్డాయి. దీంతో అనేక మందికి ప్రాణాలు పోయే పరిస్థితి ఎదురైంది. ఆక్సిజన్‌ సిలెండర్లు కూడా ఉండేవి కావు. నేడు ఆధునాతన వాహనాలతోపాట ఆధునిక వైద్య పరికరాలు అందించారు. ప్రజా ఆరోగ్యంపై ప్రభు త్వం చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. అలాగే సిబ్బంది జీతాలు పెంచారు. రెట్టించిన ఉత్సాహంతో సేవలు అందిస్తాం. 
– డి.ముకుందరావు, పైలెట్, పాలకొండ. 

సంపూర్ణ విశ్వాసం కలుగుతుంది 
పాదయాత్రగా వచ్చినప్పుడు జగనన్నకి మా సమస్యలు విన్నవించుకున్నాం. ఆయన అధికారంలోకి రాగానే మాకు జీతాలు పెంచి మాలో నూతన ఉత్సాహాన్ని నింపారు. ఏజెన్సీలో గత కొద్ది సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నాం. కనీస వసతులు లేని వాహనాలతో ఇబ్బందులు పడేవారం. ఇప్పుడు వాహనాలు అత్యాధునికం. కేవలం 20 నిమిషాల వ్యవధిలో ఘటనా స్థలం చేరుకోగలం. బాధితులను మరింత తక్కువ సమయంలో ఆస్పత్రికి చేర్చగలుగుతున్నాం. ప్రజల్లో మళ్లీ 104, 108 సేవలపై సంపూర్ణ విశ్వాసం కలుగుతుంది.  
– గిరి గణపతి, ఈఎంటీ, పాలకొండ   

మరిన్ని వార్తలు