AP: అరుదైన ఆలయం.. భారతమాతకు వందనం 

23 Aug, 2021 07:39 IST|Sakshi
పూజలందుకుంటున్న భారతమాత 

వైభవంగా భారతమాత ఆలయ వార్షికోత్సవం 

సాక్షి, కవిటి: రాష్ట్రంలోనే అత్యంత అరుదైన ఆలయంగా గుర్తింపు పొందిన శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం సీహెచ్‌ కపాసుకుద్ధిలోని భారతమాత ఆలయం 15వ వార్షికోత్సవం ఆదివారం వైభవంగా నిర్వహించారు. భారీ సంఖ్యలో మహిళలు పూర్ణ కలశాలను పట్టుకుని గ్రామంలో శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం నిరంజన్, శంకర్‌స్వామిల ఆధ్వర్యంలో భారతమాతకు విశేష పూజలు చేశారు.

చదవండి: అల్లూరి పేరిట పోస్టల్‌ కవర్‌

మత్స్యకారులు వేటను స్వచ్ఛందంగా నిలిపివేసి పూజల్లో పాల్గొన్నారు. 200 మంది మహిళలచే సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. అనంతరం భారీ సంఖ్యలో భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. ప్రత్యేక పూజల అనంతరం శోభాయాత్రలో వాడిన పూజా సామగ్రిని సముద్రంలో నిమజ్జనం చేశారు.

భక్తిశ్రద్ధలతో సామూహిక కుంకుమార్చనలు నిర్వహిస్తున్న మహిళలు 

చదవండి: భక్తుల సెల్‌ఫోన్లకు ఎప్పటికప్పుడు రోజువారీ కార్యక్రమాల వివరాలు  

మరిన్ని వార్తలు