ముగిసిన భవానీ దీక్షల విరమణలు 

20 Dec, 2022 05:41 IST|Sakshi
పూర్ణహుతి నిర్వహిస్తున్న అర్చకులు

అమ్మవారిని దర్శించుకున్న 4.5 లక్షల మంది భవానీలు 

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం వద్ద ఈ నెల 15వ తేదీన ప్రారంభమైన భవానీ దీక్షల విరమణలు సోమవారంతో ముగిశాయి. మల్లేశ్వరస్వామి వారి ఆలయం సమీపంలోని యాగశాలలో ఆలయ స్థానాచార్య విష్ణుభట్ల శివప్రసాద్‌ శర్మ పర్యవేక్షణలో ఆలయ  వైదిక కమిటీ సభ్యులు కోట ప్రసాద్, రంగావజ్జుల శ్రీనివాసశాస్త్రి, అర్చకులు మహా పూర్ణాహుతి నిర్వహించారు.

అనంతరం కలశ ఉద్వాసన, వేద ఆశీర్వచనంతో దీక్షలు పరిసమాప్తం అయ్యాయి. ఈ సందర్భంగా ఈవో భ్రమరాంబ మాట్లాడుతూ దీక్షల విరమణకు దాదాపు 4.5 లక్షల మంది భవానీలు విచ్చేశారని తెలిపారు. ఈ కార్యక్రమానికి సుమారు రూ.6 కోట్ల మేర ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. మంగళవారం నుంచి ఆర్జిత సేవ­లు యధాతథం జరుగుతాయని వివరించారు. 

మరిన్ని వార్తలు