Bhogi Festival 2022: తెలుగు రాష్ట్రాల్లో భోగి సంబరాలు..

14 Jan, 2022 09:16 IST|Sakshi

సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో వాడవాడలా సంక్రాంతి శోభ సంతరించుకుంది. శుక్రవారం తెల్లువారుజాము నుంచే భోగి మంటలు వేయటంతో పండగ వాతావరణం సందడిగా మారింది. పలువురు రాజకీయ ప్రముఖులు వారి ఇళ్ల వద్ద భోగి మంటలు వేసి.. ప్రజలుకు భోగి పండగ శుభాకాంక్షలు తెలియజేశారు.

వైఎస్సార్‌ కడప జిల్లా: భోగి పండగ సందర్భంగా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా బంధువుల ఇంట్లో ఏర్పాటు చేసిన భోగి సంబరాల్లో పాల్గొన్నారు. సంబేపల్లె మండలం, శెట్టిపల్లె గ్రామం తిమ్మక్కగారిపల్లెలో కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా భోగి మంటలు వేశారు. తన సోదరుడు మాజీ జడ్పీటీసీ ఉపేంద్రరెడ్డి నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి భోగి వేడుకల్లో పాల్గొని ఎమ్మెల్యే రోజా పాత రోజులు గుర్తు చేసుకున్నారు.


తూర్పు గోదావరి జిల్లా: రామచంద్రాపురంలో మంత్రి వేణుగోపాల కృష్ణ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జరిగియి. గ్రామీణ సంక్రాంతిని ప్రతిబింబించే విధంగా సెట్టింగ్ ఏర్పాటు చేశారు. భోగి మంటలు వేసి, కోలాటంతో సందడి చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలుగు సాంప్రదాయాల గురించి భవిష్యత్ తరాలకు తెలియజెప్పాలనే సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నాని తెలిపారు.

కృష్ణా: కృష్ణా జిల్లా విజయవాడలోని 42వ డివిజన్‌లో కార్పొరేటర్ చైతన్యరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన భోగి వేడుకల్లో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్  పాల్గొన్నారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులు మంత్రికి కోలాట నృత్యాలతో స్వాగతం పలిపారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ..  సీఎం  జగన్‌ మోహన్‌రెడ్డి పరిపాలనతో రాష్ట్రప్రజలు సంతోషంగా పండగ జరుపుకుంటున్నారని తెలిపారు. ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వం తోడుగా ఉండేలా సీఎం జగన్ కార్యక్రమాలు చేపడుతున్నారని గుర్తుచేశారు.

నెలకొక పండుగ మాదిరి సంక్షేమ పథకాలను సీఎం ప్రవేశపెడుతుంటారని చెప్పారు.  అటువంటి మంచి ముఖ్యమంత్రి నేతృత్వంలో పనిచేయడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈభోగి మంటల్లో కరోనా ఆహుతైపోవాలని, ప్రజలంతా ఆరోగ్యంతో ఉండాలని అన్నారు. ప్రజలకు మంచి చేస్తుంటే జగన్‌పై చంద్రబాబు విషం కక్కుతున్నారని అన్నారు.

నెల్లూరు: నెల్లూరులో మంత్రి అనిల్ కుమార్‌ యాదవ్‌ ఆయన ఇంట్లో కుటుంబసభ్యులతో కలిసి భోగిమంట వేశారు. ప్రజలకు భోగి పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. 

మరిన్ని వార్తలు