ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరం : భూమన

8 Aug, 2020 10:14 IST|Sakshi

సాక్షి, తిరుపతి : తిరుపతి స్కేవెంజర్స్ కాలనీలో శుక్రవారం శానిటైజర్ తాగి నలుగురు చనిపోయిన సంగతి తెలిసిందే. తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో మార్చురీని సందర్శించిన ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. శానిటైజర్‌ తాగి నలుగురు చనిపోవడం చాలా బాధాకరమన్నారు. శానిటైజర్‌ మద్యం కాదని.. కేవలం చేతులుశుభ్ర పరుచుకోవడానికి వినియోగించే మందని.. దీనిపై అధికారులు, ప్రభుత్వము పదేపదే హెచ్చరిస్తున్నా ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమన్నారు. మద్యానికి బానిసైన  యువకులు పొరపాటున శానిటైజరర్‌ తాగి ప్రాణాలు కోల్పోయారు. చేతులు శుభ్రపరుచుకుని శానిటైజర్‌ను మత్తుకు వాడకూడదని చేతులెత్తి నమస్కరిస్తున్నా అంటూ తెలిపారు.  ఎమ్మెల్యే భూమనతో పాటు రుయా సూపరిండెంట్‌ మృతదేహాల వద్ద కన్నీటిపర్యంతమయ్యారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా