అందంగా రాయడం ఒక కళ

30 Dec, 2022 04:05 IST|Sakshi
జివితేష్‌ను అభినందిస్తున్న గవర్నర్‌

గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌

మధురానగర్‌ (విజయవాడ సెంట్రల్‌): చేతిరాత ద్వారా విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించొచ్చని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ అన్నారు. బాగా చదవడంతోపాటు అందంగా రాయడం ఒక కళ అని పేర్కొన్నారు. కాలిగ్రఫీ నిపుణులు భువనచంద్ర తరఫున జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను విజయవాడ రాజ్‌భవన్‌లో గురు­వారం గవర్నర్‌ అభినందించారు.

ఈ సందర్భంగా అమ్మఒడి హ్యాండ్‌ రైటింగ్‌ అండ్‌ కాలిగ్రఫీ అకాడమీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి కాలిగ్రఫీ పోటీలకు ఎంపికైన కలెక్టర్‌ ఢిల్లీరావు కుమారుడు జివితేష్‌ చేతిరాతను గవర్నర్‌ ప్రత్యేకంగా ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో కురసాల సిరి కృష్ణ సంహిత అంజలి, విశాఖ మనుశ్రీ ప్రభుత్వ పాఠశాల, ఏలూ­రుకు చెందిన జేఎన్‌ జె.స్కూల్, జయశ్రీ హోలీ ట్రినిటీ, డమరేష్‌ శుభోదయ ఇంగ్లిష్‌ మీడియం హైస్కూల్, శ్రావ్యాంజలి చైతన్య స్కూల్, స్ఫూర్తి సిద్ధార్థ స్కూల్, హర్షిత నేతాజీ స్కూల్‌ విద్యార్థులను గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ అభినందించారు. 

మరిన్ని వార్తలు