తెలుగు ప్రజల ప్రియమైన నేత వైఎస్సార్‌

8 Jul, 2021 05:37 IST|Sakshi

గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌

సాక్షి, అమరావతి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అణగారిన ప్రజల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. వ్యవసాయ రంగాన్ని మెరుగుపరచడంతో పాటు పేద, అణగారిన వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు. వైఎస్‌ జయంతి సందర్భంగా సందేశమిస్తూ ప్రజల సంతృప్త స్థాయి వరకు సంక్షేమాన్ని అమలు చేయడం ఆ మహానేత సంకల్పమని గవర్నర్‌ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

అందుకే తెలుగువారి ప్రియమైన నాయకుడిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారన్నారు. నేల తల్లిని నమ్మిన భూమిపుత్రుడైన వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతిని ‘రైతు దినోత్సవం’గా పాటించడం సముచితమని గవర్నర్‌ చెప్పారు 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు