భవిష్యత్‌ భారత్‌దే..

18 Dec, 2022 04:05 IST|Sakshi

మరో ఐదేళ్లలో 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ

గవర్నర్‌ హరిచందన్‌ 

సాక్షి ప్రతినిధి, విజయనగరం: ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగానున్న భారతదేశానిదే భవిష్యత్‌ అని, మరో ఐదేళ్లలో ఐదు ట్రిలియన్‌ డాలర్ల స్థాయికి చేరుకుంటుందని రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. విజయనగరంలోని సెంచూరియన్‌ విశ్వవిద్యాలయం ద్వితీయ స్నాతకోత్సవం శనివారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఆయన వర్చువల్‌ విధానంలో విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు.

భారత ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం చేయడానికి నైపుణ్యం కలిగిన విద్యార్థుల భాగస్వామ్యం అవసరమన్నారు. నైపుణ్య విద్యను అందించడంలో సెంచూరియన్‌ వర్సిటీ ముందుందని ప్రశంసించారు. సెంచూరియన్‌ చాన్సలర్‌ డాక్టర్‌ దేవీప్రసన్న పట్నాయక్‌ అధ్యక్షతన జరిగిన  కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి సేవ్లానాయక్‌ గౌరవ అతిథిగా హాజరయ్యారు.

ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బంగారు పతకాలు బహూకరించారు. సెంచూరియన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ ముక్తికాంత్‌ మిశ్రా, ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్‌ డి.ఎన్‌.రావు, వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ జి.ఎస్‌.ఎన్‌.రాజు, ఒడిశా క్యాంపస్‌ వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ సుప్రియా పట్నాయక్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు