రాష్ట్రపతి, సీజేఐతో ఏపీ గవర్నర్‌ భేటీ

26 Apr, 2022 05:13 IST|Sakshi
రాష్ట్రపతితో గవర్నర్‌..

సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ సోమవారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులను ఆయన రాష్ట్రపతికి వివరించారని సమాచారం. అంతకుముందు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, హోంమంత్రి అమిత్‌షాలను గవర్నర్‌ విడివిడిగా కలిశారు.

సీజేఐను కలిసిన గవర్నర్‌.. 

అలాగే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణను కూడా గవర్నర్‌ హరిచందన్‌ కలిశారు. కాగా, ఈ నెల 22న ఢిల్లీ వచ్చిన గవర్నర్‌ 23వ తేదీన ప్రధాని మోదీని కలవగా, 24న నేషనల్‌ వార్‌ మెమోరియల్‌ను తన సతీమణితో కలిసి సందర్శించిన విషయం తెలిసిందే. గవర్నర్‌ దంపతులు మంగళవారం ఢిల్లీ నుంచి విజయవాడకు బయలుదేరి వెళ్తారని సమాచారం. 

మరిన్ని వార్తలు