రెడ్‌క్రాస్‌ సేవలు శ్లాఘనీయం

9 May, 2022 04:56 IST|Sakshi
రెడ్‌ క్రాస్‌ అంబులెన్స్‌ను ప్రారంభిస్తున్న గవర్నర్‌

గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ 

పాడేరులో థలసేమియా కేంద్రం ప్రారంభం 

సాక్షి, అమరావతి/పాడేరు రూరల్‌ (అల్లూరి సీతారామరాజు జిల్లా): రెడ్‌క్రాస్‌ సొసైటీ అనుసరిస్తున్న మానవతా స్ఫూర్తిని మరింతగా వ్యాప్తిలోకి తీసుకురావాలని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. ప్రపంచ రెడ్‌క్రాస్‌ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని రాజ్‌భవన్‌లో ఆదివారం పలు కార్యక్రమాలు నిర్వహించారు.

కాకినాడలో ఏర్పాటు చేసిన వృద్ధాశ్రమాన్ని, పాడేరు జిల్లా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన థలసేమియా, సికిల్‌సెల్‌ ఎనీమియా చికిత్సా కేంద్రాన్ని రాజ్‌భవన్‌ నుంచి వర్చువల్‌ విధానంలో గవర్నర్‌ ప్రారంభించారు. అడ్వాన్స్‌డ్‌ లైఫ్‌సపోర్ట్‌ సిస్టం అంబులెన్స్‌ను ప్రారంభించారు. రెడ్‌క్రాస్‌ ఏపీ చైర్మన్‌ శ్రీధర్, గవర్నర్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పీ సిసోడియా పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు