ప్రజలకు గవర్నర్‌ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు 

30 Aug, 2021 04:08 IST|Sakshi

సాక్షి, అమరావతి: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపినట్లు గవర్నర్‌ కార్యాలయం ఆదివారం ప్రకటన విడుదల చేసింది. జన్మాష్టమి నేపథ్యంలో శ్రీకృష్ణుని శాశ్వతమైన సందేశాన్ని భగవద్గీత గుర్తు చేస్తుందని గవర్నర్‌ పేర్కొన్నారు. సామరస్యపూర్వక సమాజ నిర్మాణానికి అవసరమైన పునాదిని స్పష్టపరుస్తుందన్నారు. కోవిడ్‌ జాగ్రత్తలు తీసుకుంటూ పండుగను జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.  

రజతం సాధించిన భావానీబెన్‌కు అభినందనలు 
టోక్యో పారాలింపిక్స్‌లో రజత పతకం సాధించిన భారత క్రీడాకారిణి భవీనాబెన్‌ పటేల్‌ను గవర్నర్‌ హరిచందన్‌ అభినందించినట్లు గవర్నర్‌ కార్యాలయం ఆదివారం ప్రకటన విడుదల చేసింది. కృషి, పట్టుదల, సంకల్పంతో టేబుల్‌ టెన్నిస్‌లో రజత పతకం సాధించడం గర్వకారణమన్నారు.  

తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు 
తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ రాష్ట్ర సంస్కృతి, వారసత్వాన్ని యుగయుగాలుగా కాపాడిన తెలుగు భాషకు గర్వకారణంగా ఈ రోజును పాటిస్తున్నాం. తెలుగు కవి గిడుగు వెంకట రామ్మూర్తి జయంతిని పురస్కరించుకుని ఈ రోజును తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం గర్వకారణం’ అని గవర్నర్‌ ఆదివారం ట్వీట్‌ చేశారు. 

మరిన్ని వార్తలు