ఏపీ రైతుల్ని ఆదుకుంటాం: బీజేపీ

24 Oct, 2020 05:09 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి:  ఏపీలో వరదలతో నష్టపోయిన రైతుల్ని అన్ని విధాలా ఆదుకుంటామని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పురుషోత్తం రూపాలా హామీ ఇచ్చారు. శుక్రవారం మంత్రి రూపాలాతో వెబినార్‌ ద్వారా వివిధ ప్రాంతాల నుంచి భాజపా ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీలు జీవీఎల్‌ నరసింహారావు, సుజనా చౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్, భాజపా జాతీయ కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి, రావెల కిశోర్‌బాబు, విష్ణువర్ధన్‌రెడ్డి, సూర్యనారాయణరాజు, ఏపీ కిసాన్‌మోర్చా అధ్యక్షుడు శశిభూషణ్‌రెడ్డి తదితరులు మాట్లాడారు.

ఏపీలో ఇటీవల భారీగా కురిసిన వర్షాల వల్ల నదులు, వాగులు, చెరువులు పొంగి గ్రామాలు, పొలాలు మునిగిపోయాయని వీర్రాజు వివరించారు. పలు పంటలు చేతికొచ్చే సమయంలో నీట మునగడంతో రైతులు నష్టపోయారని చెప్పారు. పార్టీ బృందాలు వరద ప్రాంతాల్లో పర్యటించి నష్టాన్ని అంచనా వేశాయని, ఆ నివేదిక పంపుతామని, నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలని వీర్రాజు కోరారు. ఏపీలో ప్రస్తుత వరద పరిస్థితి, పంట నష్టంపై పురందేశ్వరి, జీవీఎల్, శశిభూషణ్‌రెడ్డి వివరించగా కేంద్ర బృందాలను పంపాలని సుజనాచౌదరి, సీఎం రమేశ్‌లు కోరారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు