టీటీడీ వెబ్‌సైట్‌పై దుష్ప్రచారం.. తెలుగు దిన పత్రికపై రూ.100 కోట్ల దావా: ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి

29 Dec, 2021 13:30 IST|Sakshi

సాక్షి, తిరుపతి: హిందూ దేవాలయాలపై ఎక్కడ అసత్య ప్రచారం చేసినా తాను ముందుంటానని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి అన్నారు. దేశంలో హిందూ దేవాలయాలు ఎక్కడా ప్రభుత్వ ఆధీనంలో ఉండకూడదని, బ్రాహ్మణులే వంశపారపర్యంగా అర్చకత్వానికి అర్హులు అనడం సరికాదని చెప్పారు. ఈ మేరకు తిరుపతిలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. అనువంశిక అర్చకత్వానికి తాను వ్యతిరేకమని స్పష్టం చేశారు. పురాణాల్లో విశ్వామిత్రుడు, వాల్మీకీలు బ్రాహ్మణులు కాకపోయినా ఆధ్యాత్మిక ప్రచారం చేశారని గుర్తు చేశారు. దేశంలోని నాలుగు లక్షల హిందూ దేవాలయాలపై అసత్య ఆరోపణలు చేస్తే తాను సహించనని, న్యాయపోరాటం చేస్తానని సుబ్రమణ్యస్వామి తెలిపారు.
చదవండి: థాయ్‌లాండ్‌కు చంద్రబాబు.. అంత రహస్యమెందుకో?

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెబ్‌సైట్‌తో క్రైస్తవ మత ప్రచారం చేస్తున్నారని ఓ తెలుగు దిన పత్రిక ఆరోపణలపై టీటీడీ ఈవో విజ్ఞప్తి మేరకు పరువు నష్టం దావా కేసు వేసినట్లు ఆయన తెలిపారు. అసత్య వార్తలు రాసిన సదరు తెలుగు దినపత్రిక క్షమాపణ చెప్పాలని, రూ. 100 కోట్లు జరిమాన చెల్లించాలని ఆయన డిమాండ్‌ చేశారు. భారత దేశంలో 80 శాతం మంది హిందువులు ఉన్నారని, హిందువుగా ఉన్నందుకు గర్విస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు. ఇక తమిళ రాజకీయాల గురించి ఆయన మాట్లాడుతూ.. తమిళనాడులో కరుణానిధి, అన్నాడీఎంకే పార్టీల పాలన దరిద్రంగా సాగిందని.. ఎంకే స్టాలిన్ పాలన ఇంకా చూడలేదన్నారు. 
చదవండి: నాడు ‘పార్టీలేదు బొక్కాలేదు’.. నేడు చంద్రబాబు గుట్టు రట్టు చేసిన అచ్చెన్న

మరిన్ని వార్తలు