పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం..పడవ బోల్తా, ఇద్దరు గల్లంతు

23 May, 2023 12:39 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, ఆచంట: పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం బీమలాపురంలో విషాదం చోటుచేసుకుంది. పడవ బొల్తా పడటంతో ఇద్దరు గల్లంతయ్యారు. అధిక కొబ్బరి లోడుతో పడవ వస్తుండగా ఈ ఘటన జరిగింది. గల్లంతయిన బాధితులు వల్లురూ గ్రామనికి చెందిన కుడిపుడి పెద్దిరాజు(58), దొడ్డిపట్ల గ్రామానికి చెందిన సిరగం వెంకటన రమణ(35)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరకుని గజ ఈతగాళ్ల చేత గాలింపు చర్యలు చేపట్టారు.

సామార్థ్యానికి మించి కొబ్బరి కాయల లోడు ఎక్కించడమే ఈ ఘటనకు ప్రధాన కారణమని పోలీసులు పేర్కొన్నారు. పడవలో మొత్తం ఐదుగురు ఉన్నారని అందులో ముగ్గురు సురక్షితంగా ఉన్నట్లు వెల్లడించారు. 

(చదవండి: సప్లిమెంటరీ పరీక్షలకు సన్నద్ధత)

మరిన్ని వార్తలు