బంధుత్వం బరువైన వేళ.. 

13 Nov, 2021 08:22 IST|Sakshi

అనంతపురం సప్తగిరి సర్కిల్‌: ఓ మహిళ మృతదేహానికి ఇండియన్‌ ముస్లిం మైనార్టీ (ఐఎంఎం) ఆర్గనైజేషన్‌ సభ్యులు శుక్రవారం అంత్యక్రియలు చేసి, మానవత్వం చాటుకున్నారు. వివరాలు.. మడకశిర ప్రాంతానికి చెందిన శాంతమ్మ (53) అనారోగ్యానికి గురికావడంతో నాలుగు రోజుల క్రితం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చేరింది. శుక్రవారం తెల్లవారుజామున పరిస్థితి విషమించడంతో మృతి చెందింది. ఈ విషయాన్ని 15 ఏళ్ల కుమారుడు,

దివ్యాంగురాలైన కూతురు బంధువులకు తెలిపారు. అయినా అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. స్థానికుల సూచన మేరకు నగరంలోని ఐఎంఎం ఆర్గనైజేషన్‌ సభ్యులను కుమారుడు సంప్రదించాడు. ఐఎంఎం ఆర్గనైజేషన్‌ సభ్యులు మహాప్రస్థానం వాహనంలో మృతదేహాన్ని హిందూ శ్మశానవాటికకు తరలించి, అంత్యక్రియలు చేపట్టారు. మృతురాలి భర్త కూడా కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో ఐఎంఎం రాష్ట్ర అధ్యక్షుడు మహబూబ్‌ బాషా, సభ్యులు మహమ్మద్, ఇస్మాయిల్, దాదాబాషా, నూర్, బాషా పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు