సీఎం జగన్‌ చేతుల మీదుగా పాడి రైతులకు బోనస్‌ పంపిణీ

9 Jan, 2023 17:46 IST|Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా కర్నూలు మిల్క్‌ యూనియన్‌ (విజయడైరీ) పాడి రైతులకు బోనస్‌ పంపిణీ చేశారు. రూ.7.20 కోట్ల బోనస్‌ చెక్‌ను కర్నూలు మిల్క్‌ యూనియన్‌ ఛైర్మన్‌ ఎస్‌వీ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంకు అందజేశారు.

పాడిరైతుల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ వల్ల తమ సహకార సమితి రెండేళ్లలో రూ.27 కోట్లు లాభాలు గడించిందని ఛైర్మన్‌ తెలిపారు. ఈ సందర్భంగా కర్నూలు మిల్క్‌ యూనియన్‌ సమగ్ర పనితీరును వివరించారు. రానున్న రోజుల్లో డైరీని మరింత అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళతామని ఛైర్మన్‌, ఎండీ, డైరెక్టర్‌లు సీఎం జగన్‌కు వివరించారు. 

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గంగుల బిజేంద్రారెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, కర్నూలు మిల్క్‌ యూనియన్‌ (విజయడైరీ) ఛైర్మన్‌ ఎస్‌వీ జగన్‌మోహన్‌రెడ్డి, ఎండీ పరమేశ్వర్‌రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్‌ రాజేష్‌, సొసైటీ డెరెక్టర్లు జి.విజయసింహారెడ్డి, యు.రమణ, మహిళా పాడి రైతు ఎన్‌. సరళమ్మ పాల్గొన్నారు. 

చదవండి: (పవన్‌, చంద్రబాబు కలయికపై బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కామెంట్స్‌)

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు