అభివృద్ధే లక్ష్యంగా సీఎం జగన్ ప్రభుత్వం: మంత్రి బొత్స

30 May, 2021 12:58 IST|Sakshi

సాక్షి, విజయవాడ: అభివృద్ధే లక్ష్యంగా సీఎం వైఎస్‌ జగన్ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నేటితో రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశాలను 99 శాతం సీఎం జగన్ పూర్తి చేశారని.. అన్ని వర్గాల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. దీర్ఘకాలిక ప్రణాళికలు వేసుకుంటూ ఈ ప్రభుత్వం ముందుకెళ్తోందని మంత్రి బొత్స పేర్కొన్నారు.

‘‘మా ప్రభుత్వ విధానం రాష్ట్ర సమగ్రాభివృద్ధే. ఎన్నడూ చూడని సంక్షేమ పాలనను ప్రజలకు సీఎం చేరువ చేశారు. దళారులు, మధ్యవర్తులు లేకుండా లబ్దిదారులకు సంక్షేమం చేరింది. ప్రజలకు అందించిన సంక్షేమంపై ప్రతి ఇంటికి బుక్‌ లెట్ పంపిస్తాం. పిచ్చోడి మాటల్లా లోకేష్‌ వ్యాఖ్యలు ఉన్నాయని’’ మంత్రి బొత్స మండిపడ్డారు.

సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా..
గుంటూరు: రాష్ట్రంలో రాజన్న పాలన కొనసాగుతోందని హోంమంత్రి సుచరిత అన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా సీఎం జగన్ ముందుకెళ్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో మహిళలకు సీఎం జగన్ పెద్దపీట వేశారని పేర్కొన్నారు. నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పించారని తెలిపారు. 30 లక్షల మంది పేదలకు ఇళ్లపట్టాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌దేనని హోంమంత్రి సుచరిత అన్నారు. ‘‘అమ్మఒడి పథకం ద్వారా ప్రభుత్వ స్కూళ్లల్లో నూతన ఒరవడి తెచ్చారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజ్‌ను సీఎం ఏర్పాటు చేశారు రైతులకు పూర్తి స్థాయిలో అండదండలు కల్పిస్తున్నారు. కరోనా కష్టకాలంలో బాధితులకు ప్రభుత్వం అండగా నిలిచింది. కరోనా వైద్య చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చిన ఘనత సీఎం జగన్‌కు దక్కుతుందని’’ సుచరిత అన్నారు.

కార్మిక వర్గానికి సీఎం జగన్ అండగా నిలిచారు..
దేశంలో ఎవరూ చేయని విధంగా సీఎం జగన్ సుపరిపాలన అందిస్తున్నారని  ఏపీ ఎస్‌ఎఫ్‌ఎల్ ఛైర్మన్ గౌతమ్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కార్మిక వర్గానికి సీఎం జగన్ అండగా నిలిచారన్నారు. ఎల్లోమీడియా అడ్డం పెట్టుకుని చంద్రబాబు విమర్శలు చేయడం సరికాదన్నారు. చంద్రబాబు, లోకేష్‌ నీచరాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు.

చదవండి: రెండేళ్ల పాలనపై పుస్తకాన్ని విడుదల చేసిన సీఎం జగన్‌ 
సీఎం జగన్‌ను ప్రశంసించిన కేంద్రమంత్రి

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు