రామోజీ, రాధాకృష్ణలే చంద్రబాబుకు గురువులు: మంత్రి బొత్స

5 Sep, 2022 18:05 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: గురు దేవోభవ అంటూ ప్రతీ ఏటా గురువులని సత్కరించుకునే సంప్రదాయం మనకు ఉంది. ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 176 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించారు. ఇది టీడీపీ నేతలకు మింగుడుపడటం లేదని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ ‘సీఎం వైఎస్‌ జగన్‌.. ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించి వారి సేవలను కొనియాడారు. టీడీపీ నేతలు ఒక పండుగ లాంటి రోజు కూడా రాజకీయ ఉపన్యాసాలు ఇస్తూ గురువును అవహేలన చేస్తున్నారు. దీన్ని చూస్తే చంద్రబాబునాయుడు ఎంత దిగజారిపోయాడో స్పష్టమవుతోంది. చంద్రబాబుకి మానవత్వం లేదు.. విలువలు లేవు.

సెప్టెంబర్ 5 ఆయన ఇష్టపడే రోజు కాదు. ఆయనకి వెన్నుపోటు పొడిచిన రోజంటే ఇష్టం. ఇలాంటి రాజకీయాలు, చీటింగులు ఆరోజు మాట్లాడుకోవాలి. వెన్నుపోటుకు ఆజ్యం పోసిన రామోజీ, రాధాకృష్ణలు ఆయన గురువులు. గురువులు అనే పదాన్ని ఈ రకంగా కించపరచడం సబబా?. నీ హయంలో విద్యారంగానికి ఏం చేశావో రెండు ముక్కలు చూపించు. సీఎం వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక ఫౌండేషన్ స్థాయి నుంచి విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొచ్చాము. ఇవన్నీ మేము గర్వంగా చెప్పుకుంటాం.. నువ్వు చెప్పుకోడానికి ఏమన్నా ఉందా?. ఇలాంటి ప్రతిపక్ష నాయకుడు ఈ రాష్ట్రంలో ఉండటం మన కర్మ’ అంటూ వ్యాఖ్యలు చేశారు.

ఇది కూడా చదవండి: టీచర్లను రెచ్చగొట్టేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తోంది: సీఎం జగన్‌

మరిన్ని వార్తలు