తణుకు టీడీఆర్‌ బాండ్ల విషయంలో టీడీపీ హస్తం: మంత్రి బొత్స

17 Mar, 2022 16:54 IST|Sakshi
మంత్రి బొత్స సత్యనారాయణ

సాక్షి, అమరావతి: తణుకు టీడీఆర్‌ బాండ్ల విషయంలో టీడీపీ హస్తం ఉందని  మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద విలేకర్లతో మాట్లాడుతూ.. టీడీపీ సానుభూతిపరులు అధికారులతో కుమ్మక్కయ్యారని మండిపడ్డారు. ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావుపై టీడీపీ ఆరోపణలు అర్ధరహితమని అ‍న్నారు. అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకున్నామని  చెప్పారు. 

తణుకు టీడీఆర్‌ బాండ్ల జారీ విషయంలో టీడీపీ నేతలు ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తణుకులో ఒకే సామాజిక వర్గానికి చెందిన టీడీపీ సానుభూతిపరులు అధికారులతో కుమ్మక్కయ్యారని మండిపడ్డారు. ఈ అక్రమాలపై తణుకు ఎమ్మెల్యే కారుమూరి పది రోజుల క్రితమే తనకు ఫిర్యాదు చేశారని గుర్తుచేశారు.

కారుమూరిపై టీడీపీ ఆరోపణలు అర్ధరహితమని, అక్రమాలకి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకున్నామని, పూర్తిస్ధాయి విచారణకి కూడా ఆదేశించామని పేర్కొన్నారు. మాట్లాడటానికి విషయం లేక అసెంబ్లీలో టీడీపీ నేతలు ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

మద్యపాన నిషేధం అమలు చేసింది ఎన్టీఆర్ అయితే దానికి తూట్లు పొడిచింది చంద్రబాబు కాదా? అని సూటిగా ప్రశ్నించారు. మద్య నిషేధం అమలు చేస్తామని తాము చెబుతున్న విధంగానే చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సోమవారం సాయంత్రం ఉద్యోగ సంఘాలతో పెండింగ్ అంశాలపై మరోసారి చర్చించనున్నామని మంత్రి బొత్స తెలిపారు. 

గవర్నర్‌ ప్రసంగం రోజే..: అంబటి
టీడీపీ సభ్యులు అసాధారణంగా ప్రవర్తించారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ సభ్యులు స్పీకర్‌ పట్ల అనుచితంగా ప్రవర్తించారని దుయ్యబట్టారు. టీడీపీ తీరు శాసనసభను కించపరిచే విధంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్‌ ప్రసంగం రోజే టీడీపీ వైఖరి బయటపడిందని తెలిపారు. స్పీకర్‌ పట్ల దురుసుగా ప్రవర్తించిన వారిని సస్పెండ్‌ చేయకుండా ఏం చేస్తామని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు