విద్య, వైద్యరంగాలపై సీఎం జగన్‌ ప్రత్యేక దృష్టి

31 Dec, 2020 17:22 IST|Sakshi

మంత్రి బొత్స సత్యనారాయణ

సాక్షి, తాడేపల్లి: గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని నెరవేర్చామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గురువారం ఆయన వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా  సమావేశంలో మాట్లాడుతూ గ్రామ,వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. కరోనా విపత్కర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని, కోటి మందికిపైగా కరోనా పరీక్షలు చేసి భయాందోళనలు తొలగించామని పేర్కొన్నారు. అవసరమైన అన్ని చర్యలు తీసుకుని కరోనా కట్టడి చేశామన్నారు.(చదవండి: ‘సీఎం జగన్‌ చెప్పారంటే.. చేస్తారంతే’)

‘‘సీఎం జగన్‌ పేదల సొంతింటి కలను నెరవేర్చారు. 30.75 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నాం. విద్య, వైద్యరంగాలపై సీఎం జగన్‌ ప్రత్యేక దృష్టి పెట్టారు. నాడు-నేడు ద్వారా మార్పులు తీసుకొచ్చే కార్యక్రమాలు చేపట్టాం. అమ్మఒడి ద్వారా తల్లుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేస్తున్నాం. మధ్యాహ్న భోజనంలో పౌష్టికాహారం ఉండేలా చర్యలు తీసుకున్నాం. వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చామని’’ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. (చదవండి: విద్యుత్‌ సంస్థలు లాభాల బాట: బాలినేని)

మరిన్ని వార్తలు