నాన్నా..లేరా.. నాన్నను చూడరా

13 Apr, 2021 07:03 IST|Sakshi
నీకేంకాదు: బిడ్డను ఎత్తుకుని బైక్‌ ఎక్కేందుకు- లే..రా...కన్నా: బిడ్డను బతిమాలుతూ... -వెళ్లిపోయావా తండ్రీ: చనిపోయాడని తెలిసి...

కళ్యాణదుర్గం రూరల్‌: తన ప్రతిరూపం.. ఇంటికి పెద్దకొడుకు.. కళ్లముందే చెరువులోకి దిగి కళ్లు తేలేశాడు. ఊపిరిలేదని పక్కనున్న వాళ్లంతా వారిస్తున్నా.. కుమారుడిని బతికించుకునేందుకు ఆ తండ్రి పడిన ప్రయాస.. వేదన అక్కడున్న వాళ్లను కలచివేసింది. పరుగున వెళ్లి బిడ్డను గుండెలకు హత్తుకున్న తండ్రి.. ‘‘నాన్నా లేరా.. నాన్నను చూడరా’’ అంటూనే బైక్‌పై బిడ్డను ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు పడరానిపాట్లు పడ్డాడు.

తన ఇంటిదీపం ఆరిపోగా.. ఆ కన్నతండ్రి శోకం మిన్నంటింది. ఈ విషాదకర ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. కళ్యాణదుర్గం మండలం గోళ్ల గ్రామానికి చెందిన ఓబులేసు, గంగమ్మలకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం. వీరిలో పెద్ద కుమారుడు హనుమేష్‌ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. సోమవారం తండ్రితో పాటు కట్టెల కోసం గ్రామ సమీపంలోని చెరువు వద్దకు వెళ్లిన హనుమేష్‌ ఇంకుడు గుంతల్లో నీరు ఉండటంతో తన తండ్రికి తెలియకుండా ఈతకు వెళ్లాడు. అయితే ఈత రాకపోవడంతో గుంతలోని బురదలో చిక్కుకుని మృత్యువాత పడ్డాడు. కుమారుడిని వెంటనే గమనించిన ఓబులేసు రక్షించుకోవడానికి పడిన ప్రయాస అందరినీ కంటతడి పెట్టించింది.
చదవండి:
హోంగార్డు భార్య మృతి కేసులో ట్విస్ట్‌   
ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య 

మరిన్ని వార్తలు