బీపీవో ఉద్యోగాలు..ఏపీ నుంచే అత్యధికం

8 Jun, 2021 10:43 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: బిజినెస్‌ ప్రాసెస్‌ ఔట్‌సోర్సింగ్‌ ప్రోత్సాహక పథకం కింద దేశవ్యాప్తంగా 247 బీపీవో/ఐటీఈఎస్‌ యూనిట్లు కార్యకలాపాలు సాగిస్తున్నాయని సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్స్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌టీపీఐ) తెలిపింది. 102 నగరాల్లో ఇవి విస్తరించాయని వివరించింది. ప్రత్యక్షంగా ఈ యూనిట్ల ద్వారా 41,628 మందికి ఉద్యోగావకాశాలు లభించాయని ఎస్‌టీపీఐ డైరెక్టర్‌ జనరల్‌ ఓంకార్‌ రాయ్‌ వెల్లడించారు. ఇందులో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌ నుంచి 10,673 మంది ఉన్నారని తెలిపారు.

ఏపీ నుంచి ఐటీ, అనుబంధ సేవల ఎగుమతులు 2016–17లో రూ.526.69 కోట్లు నమోదైతే.. గత ఆర్థిక సంవత్సరంలో ఇవి రూ.836.42 కోట్లకు చేరాయని పేర్కొన్నారు. ఎస్‌టీపీఐ కొత్తగా 12 సెంటర్స్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ అందుబాటులోకి తీసుకు వస్తున్నట్టు తెలిపారు. వీటిలో ఇండస్ట్రీ 4.0 టెక్నాలజీ పేరుతో ఒక కేంద్రం వైజాగ్‌లో ఏర్పాటవు తుందని చెప్పారు. బీపీవో ప్రమోషన్‌ స్కీమ్‌ కింద చిన్న పట్టణాల్లో ఐటీ పరిశ్రమను బలోపేతం చేయడంలో భాగంగా బీపీవో యూనిట్ల ఏర్పాటుకు కంపెనీలకు ఎస్‌టీపీఐ ప్రోత్సాహకాలను అందిస్తోంది.

చదవండి :  నైకీ, హెచ్‌అండ్‌ఎం బ్రాండ్స్‌కు చైనా షాక్‌
stockmarket: సెన్సెక్స్,నిఫ్టీ కన్సాలిడేషన్‌

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు