Tirumala: శ్రీవారిని దర్శించుకున్న​ సీఎం జగన్‌

19 Sep, 2023 08:02 IST|Sakshi

CM Jagan Tirumala Tirupati Tour Live Updates

07:19AM, 19-09-2023
►తిరుమల  శ్రీవారి దర్శనం ముగించుకుని పద్మావతి అతిథి గృహానికి బయలుదేరిన సీఎం జగన్
►సీఎం వెంట డిప్యూటీ సీఎంలు నారాయణ స్వామి, కొట్టు సత్యనారాయణ, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్.కే.రోజా, టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ భరత్, ఈవో ధర్నా రెడ్డి

07:09AM, 19-09-2023

►శ్రీవారిని దర్శించుకుని శ్రీరంగనాయకులు మండపంకు చేరుకున్న సీఎం జగన్

►ఆశీర్వదించిన వేద పండితులు

06:40AM, 19-09-2023

►మహాద్వారం వద్ద స్వాగతం పలికిన ఆలయ ప్రధాన అర్చకులు

►సీఎం జగన్‌మోహన్‌రెడ్డితో పాటు.టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,

►శ్రీవారి ఆలయంకు చేరుకున్న సీఎం జగన్‌

 09:19PM, 18-09-2023
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు రాత్రి పెద శేష వాహనంపై  శ్రీదేవి భూదేవి సమేతుడై భక్తులకు దర్శనం ఇస్తున్న మలయప్ప స్వామి
►  గోవిందా నామ స్మరణతో మార్మోగుతున్న తిరుమాడ వీధులు
► తిరుమాడ వీధుల్లో  పెద శేష వాహన స్వామి
► మంగళ వాయిద్యాలు , కొలాటల నడుమ కోలాహలంగా సాగిన  వాహన సేవ
► విశేష సంఖ్యలో పాల్గొని కర్పూర నీరాజనాలు అందించిన భక్తులు
► గోవింద నామ స్మరణతో మారు మ్రోగిన తిరువీధులు...

08:41PM
► తిరుమలలో వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు.  
►మీనలగ్నంలో బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణం.
► కాసేపట్లో పెద శేష వాహనంపై శ్రీవారి ఊరేగింపు.

08:18PM
తిరుమలలో సీఎం జగన్‌

► శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ.. స్వామివారి దర్శనం అనంతరం సీఎం జగన్‌కు వేద పండితుల ఆశీర్వచనం. 
►  శ్రీవారి ఆలయం రంగరాయలు మండపంలో 2024 టీటీడీ క్యాలెండర్‌, డైరీని ఆవిష్కరించిన సీఎం జగన్‌
►  శ్రీవారి ఆలయం నుంచి శ్రీపద్మావతి గెస్ట్ హౌస్‌కు బయలుదేరిన సీఎం జగన్.. రాత్రికి ఇక్కడే బస

08:07PM
► తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సీఎం జగన్‌ పాల్గొన్నారు.
► ప్రభుత్వం తరపున స్వామివారికి సీఎం జగన్‌ పట్టువస్త్రాలు సమర్పించారు.
 

07:55PM
శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్‌
తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. ఏపీ ప్రభుత్వం తరుపున స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. సీఎం జగన్‌ వెంట టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, డిప్యూటీ సీఎంలు నారాయణ స్వామి, కొట్టు సత్యనారాయణ,  మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్,  మాజీ మంత్రి కొడాలి నాని ఉన్నారు.

07:50PM
► సీఎం జగన్‌కి పరివట్టం కట్టిన ఆలయ ప్రధాన అర్చకులు.
► పట్టువస్త్రాలు సమర్పించేందుకు బేడి ఆంజనేయ స్వామి గుడి నుంచి బయల్దేరిన సీఎం జగన్‌.

07:42PM
► బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న సీఎం వైఎస్‌ జగన్‌
► సీఎం జగన్‌తో బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న పలువురు మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు.
► మరికాసేపట్లో శ్రీవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాల సమర్పణ 

06:42PM
► కాసేపట్లో బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకోనున్న సీఎం జగన్‌. ఆపై శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ.  

06:37PM
► రచన అతిథి గృహాన్ని ప్రారంభించిన సీఎం జగన్‌

06:08PM
►వకులమాత గెస్ట్ హౌస్ ప్రారంభించిన సీఎం జగన్‌.

06:05PM
► తిరుమల చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌

05:40PM
► తిరుమలలో వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు. మాడవీధుల్లో గరుడ ధ్వజపటం, స్వామి, అమ్మవార్ల ఊరేగింపు. మీనలగ్నంలో బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణం. రాత్రి 9గంటలకు పెదశేష వాహనంపై శ్రీవారి దర్శనం. 

05:28PM
మరికాసేపట్లో తిరుమలకు సీఎం జగన్‌
► తాతయ్య గుంట గంగమ్మ ఆలయం దర్శించుకొని తిరుమలకి బయలుదేరిన సీఎం
► మరికాసేపట్లో తిరుమల చేరుకోనున్న సీఎం జగన్‌
► తిరుమలలో వకుళా మాత, రచన అతిథి గృహాలు ప్రారంభించనున్న సీఎం జగన్‌
► అనంతరం ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ

05:25PM
► తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ దేవత  ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం  జగన్‌

05:20PM
►గంగమ్మ ఆలయానికి చేరుకున్న సీఎం జగన్‌. 

04:53PM
► తిరుపతి శ్రీపద్మావతి పురం నుంచి గంగమ్మ ఆలయానికి బయలుదేరిన సీఎం జగన్

04:42PM
► టీటీడీ ఉద్యోగులకు సీఎం జగన్‌ చేతుల మీదుగా పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది.

04:30PM
శ్రీపద్మావతిపురం.. సీఎం జగన్‌ ప్రసంగం

►ఈరోజు చాలా అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం సంతోషంగా ఉంది. 2019లో అప్పట్లో కేవలం ఎన్నికల నిమిత్తం టెంకాయ కొట్టి.. జీవో ఇచ్చేసిన పరిస్థితి నుంచి.. ఈ నాలుగు సంవత్సరాల్లో ఆ ప్రాజెక్టును చెయ్యి పట్టుకుని నడిపించాం. ఇవాళ ఆ శ్రీనివాస సేతు ఫ్లైఓవర్‌ను ప్రారంభించి.. తిరుపతి ప్రజలకు అంకితమిస్తున్నా.  దాదాపు 650 కోట్ల ప్రాజెక్టు.. ఏడు కిలోమీటర్ల పొడవునా.. తిరుపతి ప్రజలకు ప్రత్యేకించి గుడికి పోయే భక్తులకు మరి ఎక్కువగా ఉపయోగపడుతుంది. 

►ఎస్వీ ఆర్ట్స్‌ కాలేజీ హాస్టల్‌కు సంబంధించి.. 37 కోట్ల రూపాయలకు సంబంధించి హాస్టల్స్‌ ప్రారంభించడం వల్ల మెరుగైన వసతులు విద్యార్థులకు అందనున్నాయి. 

►వకులమాత రెస్ట్ హౌస్,  రచన రెస్ట్ హౌస్ ప్రారంభించి టీటీడీకి ఇవ్వడం జరగనుంది. 

►అన్నింటికంటే సంతోషం కలిగించే అంశం ఏంటంటే.. టీటీడీలో పని చేస్తున్న దాదాపు 6,700 మంది ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఉండాలని.. మంచి జరగాలనే తాపత్రయంతో త్వరగా అడుగులు వేశాం. రూ. 313 కోట్ల రూపాయల్ని ఖర్చు చేసి.. 3,518 మందికి సంబంధించి ఈరోజు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నాం. మరో 280 కోట్లు ఖర్చు చేసి మరో మూడు వేల మందికి ఇస్తాం. ఈ ప్రక్రియ కూడా నెల నుంచి 45 రోజుల్లో పూర్తి చేస్తాం.

►దాదాపు 600 కోట్ల రూపాయలతో.. ఏడు వేల మంది టీటీడీ ఉద్యోగుల ముఖాల్లో సంతోషం చూస్తున్నాం. ఇది అన్నింటికి కంటే ఎక్కువ సంతోషం ఇచ్చే రోజు ఇది. 

►22ఏలో అమ్మాలనుకున్న ఇవ్వలేని పరిస్థితిలో సతమతమవుతా ఉన్న పరిస్థితుల్లో నేను ఒకసారి తిరుపతికి వచ్చినప్పుడు వచ్చినప్పుడు నా దృష్టికి తీసుకువచ్చిన ఆ సమస్యను పరిష్కరించి సుమారు 8,000 మందికి పైగా నుంచి విముక్తి కల్పించాం. 8,050 మందికి తిరుపతిలో ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. 2,500 చంద్రగిరిలో 22 ఏలో నుంచి తొలగించి ఉపశమనం కలిగించడం జరిగింది.  ఇవన్నీ దేవుడి దయతో చేసే అవకాశం కలిగింది. ఈ నాలుగేళ్లలో మంచి జరగాలని కోరుకుంటూ అడుగులు వేశాం.

►ఇవాళ రూ. 1300 కోట్ల రూపాయలకు సంబంధించిన పలు కార్యక్రమాలు ప్రారంభించడం సంతోషం కలిగించింది. మరింత మంచి చేసే అవకాశం కలగాలని మనసారా కోరుకుంటూ సెలవు. 

04:25PM
60 ఏళ్ల కల సీఎం జగన్‌ సాకారం చేశారు: భూమన
► టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని గతంలో వైఎస్సార్‌ నిర్ణయించారు.  
►పేదల పట్ల గౌరవం ఉన్న వ్యక్తి సీఎం జగన్‌.
► టీటీడీ ఉద్యోగుల సొంతింటి కల సాకారం చేశారు.
► టీటీడీ ఇళ్ల పట్టాల పంపిణీ సీఎం జగన్‌ తీసుకున్న చారిత్రక నిర్ణయం.
►సీఎం జగన్‌ చొరవతోనే శ్రీనివాస సేతు ప్రాజెక్టు పూర్తయ్యింది. 

04:20PM
►  గోవిందరాజస్వామి డిగ్రీ కాలేజీకి సంబంధించి.. ఎస్.వి.ఆర్ట్స్ కళాశాల హాస్టల్ భవనాల శిలాఫలకాల ఆవిష్కరణ చేసి  ప్రారంభించారు సీఎం జగన్‌.

04:15PM
► శ్రీపద్మావతిపురంలో శ్రీనివాస సేతు ఫ్లైఓవర్‌ ప్రారంభించిన సీఎం జగన్‌. రూ.684 కోట్లతో ఫ్లైఓవర్‌ నిర్మాణం.

04:12PM
► శ్రీపద్మావతిపురం చేరుకున్న సీఎం జగన్‌. శాస్త్రోక్తంగా పూజల్లో పాల్గొన్న సీఎం జగన్‌.

03:49PM
► రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుపతి కు బయలుదేరిన సీఎం జగన్‌. మరికాసేపట్లో శ్రీనివాస సేతు ఫ్లైఓవర్‌ ప్రారంభం

03:33PM
► రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్
► సీఎం జగన్‌కు స్వాగతం పలికిన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, ఆర్కే రోజా, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి

02:23PM
► తిరుమల బ్రహ్మోత్సవాల్లో.. స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తిరుపతి పర్యటనకు బయల్దేరారు. అదే సమయంలో తిరుపతిలో పలు ప్రారంభోత్సవాల్లో ఆయన పాల్గొంటారు.

తిరుమల స్వామివారికి..  సోమవారం సాయంత్రం 6.15–6.30 గంటల మధ్య మీన లగ్నంలో శాస్త్రోక్తం గా ధ్వజారోహణం నిర్వహించడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. రాత్రి 9 గంటలకు పెద శేషవాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి ఊరేగనున్నారు.  బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చారు. 

సీఎం జగన్‌ రేపటి(సెప్టెంబర్‌ 19) షెడ్యూల్‌ ఇదే..
►మంగళవారం ఉదయం 6.20 గంటలకు సీఎం జగన్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. 

మరిన్ని వార్తలు