నిశ్చితార్థం బాగానే జరిగింది.. తీరా పెళ్లి పత్రికలు పంచుతుండగా..

4 Dec, 2021 11:45 IST|Sakshi
డీఎస్పీ వినోద్‌కుమార్‌కు వినతిపత్రం అందిస్తున్న వధువు బంధువులు, నాయకులు

న్యాయం చేయాలని డీఎస్పీకి ఫిర్యాదు 

సాక్షి,పెద్దకడబూరు( కర్నూలు): నిశ్చితార్థం అయ్యాక వరుడు పెళ్లి వద్దంటున్నాడని, తమకు న్యాయం చేయాలని వధువు బందువులు కోరారు. ఈ మేరకు శుక్రవారం ఎమ్మార్పీఎస్‌ నాయకులతో కలిసి డీఎస్పీ వినోద్‌కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బొందు మడుగుల రమేష్‌ మాట్లాడుతూ ఆదోని పట్టణంలోని ఇంద్ర నగర్‌కు చెందిన అంజలికి పెద్దకడబూరు మండల కేంద్రానికి చెందిన రవితో పెద్దల సమక్షంలో పెళ్లి నిశ్చయించారన్నారు.

నిశ్చితార్థం కూడా పూర్తయి, పెళ్లి తేదీని నిర్ణయించి పత్రికలను బంధువులకు పంచినట్లు తెలిపారు. తీరా ఇప్పుడు పెళ్లికొడుకు తనకు పెళ్లి ఇష్టం లేదని దాటవేస్తున్నాడన్నారు. రవితో పెళ్లి జరిపించి బాధితురాలికి న్యాయం జరిగేలా చూడాలని కోరారు. స్పందించిన డీఎస్పీ వరుడు కుటుంబ సభ్యులతో మాట్లాడి యువతికి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.  

చదవండి: వివాహేతర సంబంధం.. భార్యను పలుమార్లు హెచ్చరించాడు.. చివరకు

మరిన్ని వార్తలు