అమ్మాయి మోసం చేస్తే ఎందుకు ప్రశ్నించరు.. లేఖ రాసి బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య

8 Jan, 2023 13:28 IST|Sakshi

సాక్షి, విజయవాడ: సూసైడ్‌ నోట్‌ రాసిపెట్టి బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. కాగా, విద్యార్థి ఆత్మహత్యకు ప్రేమ వ్యవహరమే కారణమైనట్టు తెలుస్తోంది. ప్రేయసి చేసిన మోసం తట్టుకోలేకనే.. పేరెంట్స్‌కు ఏం చెప్పాలో తెలియకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు లేఖలో రాశాడు. 

వివరాల ప్రకారం.. బీటెక్‌ విద్యార్థి అబ్దుల్‌ సలామ్‌ సూసైడ్‌ నోట్‌ రాసిపెట్టి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సుకుమిక అనే యువతి తనను ప్రేమ పేరుతో మోసం చేసిందని లేఖలో రాసుకొచ్చాడు. ఆమె టైమ్‌ పాస్‌ ప్రేమ వల్ల తాను పిచ్చోడిని అయ్యానని.. తనకు ‍జీవితం మీద విరక్తి కలిగిందని చెప్పుకొచ్చాడు. తన తల్లిదండ్రులకు సమాధానం చెప్పలేకనే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. 

అయితే, సుకుమిక తనపై ఫేక్‌ ప్రేమ నటిస్తూ.. వివాహితుడైన ఓ లెక్చరర్‌తో సంబంధం కొనసాగిస్తున్నదని.. వీడియో కాల్స్‌తో అసభ్యకరంగా వీడియోలు తీసుకున్నదని సలామ్‌ లేఖలో రాశాడు. అర్ధరాత్రి మరో వ్యక్తితో కూడా ఇలా వీడియో కాల్స్‌ మాట్లాడుతోందని తెలిపాడు. తన ప్రవర్తనను మార్చాలని ఎంతగా ప్రయత్నించినప్పటికీ మారలేదని పేర్కొన్నాడు. అదే సమయంలో అబ్బాయిలు మోసం చేసే హైలైట్‌ చేస్తారు కానీ.. అమ్మాయిలు మోసం చేస్తే ఎందుకు ప్రశ్నించరు అంటూ ప్రశ్నించాడు. కుసుమిక చేతిలో మోసపోయిన అమాయకపు అబ్బాయిలకు న్యాయం చేయాలంటూ లేఖలో రాశాడు. 

మరిన్ని వార్తలు