కోవిడ్‌ అత్యవసర నిధి నుంచి రూ.981 కోట్లు ఇవ్వండి

25 Nov, 2020 04:30 IST|Sakshi
కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌తో చర్చిస్తున్న బుగ్గన

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డా.హర్షవర్ధన్‌తో బుగ్గన భేటీ  

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా కట్టడి కోసం ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్‌–19 పరీక్షలను, కోవిడ్‌ కేర్‌ సెంటర్లను, ఐసీయూ, నాన్‌ ఐసీయూ పడకలను పెంచడం, తాత్కాలిక సిబ్బంది నియామకాల్ని చేపట్టడం కారణంగా రాష్ట్రంపై ఆర్థిక భారం ఎక్కువగా ఉందని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. మంగళవారం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌తో జరిగిన సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై బుగ్గన చర్చించారు.

అనంతరం బుగ్గన రాజేంద్రనాథ్‌ మీడియాతో మాటాడుతూ.. కరోనా విపత్తు నేపథ్యంలో కోవిడ్‌ అత్యవసర నిధి నుంచి రాష్ట్రానికి రూ.981 కోట్లు సాయం అందించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో కనీసం ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారని, ఇందుకు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ అనుమతించాలని కోరామని బుగ్గన వివరించారు. 16 మెడికల్‌ కాలేజీల ఏర్పాటుపై చేసిన విజ్ఞప్తిని కేంద్ర మంత్రి పరిశీలిస్తామని హామీ 
ఇచి్చనట్లు బుగ్గన రాజేంద్రనాథ్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు