‘తప్పుడు లెక్కలతో ప్రజలను బురిడీ కొట్టించలేరు’

17 Sep, 2021 10:50 IST|Sakshi
ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ( ఫైల్‌ ఫోటో )

ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వృద్ధిరేట్లపై టీడీపీవి తప్పుడు లెక్కలని ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. కరోనాకు ముందు ఏడాది 2019-2020లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి 7.23 శాతంగా ఉన్నట్ల తెలిపారు. వ్యవసాయరంగంలో 7.91 శాతం, పారిశ్రామిక రంగంలో 10.24 శాతం వృద్ధి ఉన్నట్లు చెప్పారు. 20202-2021 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల ఇండెక్స్‌లో ఏపీకి 3వ ర్యాంకు సాధించినట్లు తెలిపారు. నీతిఆయోగ్‌ నివేదిక ప్రకారం పేదరిక నిర్మూలన, అసమానతల తగ్గింపులో ఏపీకి 5,6 స్థానాలు వచ్చాయని పేర్కొన్నారు.

చదవండి: AP: ఏఎన్‌యూకి టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ర్యాంకు

తప్పుడు లెక్కలతో టీడీపీ నేతలు ప్రజలను బురిడీ కొట్టించలేరని ఆయన మండిపడ్డారు.  ప్రతి పక్షంలో ఉండి ఏ మాత్రం బాధ్యత లేకుండా యనమల రామకృష్ణుడు రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టిస్తూ, గందరగోళపరిచే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. వ్యవసాయ రంగం యొక్క వృద్ధి రేటు దాచిపెట్టి టీడీపీకి అనుకూలమైన లెక్కల చెప్పి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.

మరిన్ని వార్తలు