-

లోకల్‌కు బ్రాండింగ్‌ కోసం.. ఏపీ పరిశ్రమలశాఖ నేతృత్వంలో బిజినెస్‌ సమ్మిట్‌

18 Oct, 2022 10:49 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ పరిశ్రమల శాఖ నేతృత్వంలో ఇవాళ(మంగళవారం) బిజినెస్‌ సమ్మిట్‌ మొదలైంది. ఈ సమ్మిట్‌లో నార్వే, జర్మనీ దేశాల్లోని భారత రాయబారులు హాజరయ్యారు. వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, టూరిజం, చేనేత, టెక్స్ టైల్ తదితర రంగాల్లో అవకాశాల వివరణకు ఈ సమ్మిట్‌ ఒక వేదికగా నిలవనుంది. 

ప్రముఖంగా ఒక జిల్లా ఒక ఉత్పత్తి కింద ఎగుమతి అవకాశాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు.  నార్వే, జర్మనీ దేశాల్లోని భారత రాయబారులైన బి.భాస్కర్, పి.హరీష్‌లు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఇక ఈ సదస్సులో ప్రత్యేకార్షణగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, స్థానిక ఉత్పత్తులకు బ్రాండింగే లక్ష్యంగా సదస్సు  జరుగుతోంది. 

ఈ సదస్సుకు.. పరిశ్రమల శాఖ డైరెక్టర్ జి.సృజన, చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత, ఉద్యానవనం, ఆహారశుద్ధి, వ్యవసాయం, మత్స్య శాఖ కార్యదర్శి చిరంజీవి చౌదరి, పర్యాటక విభాగం అథారిటీ సీఈవో కె.కన్నబాబు, ఏపీఈడీబీ సీఈవో డాక్టర్ నారాయణ భరత్ గుప్తా, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి కోన శశిధర్ తదితరులు హాజరయ్యారు.

సంబంధిత కథనం: 3టీ విధానంతో జర్మనీ, నార్వేకు ఎగుమతులు

మరిన్ని వార్తలు