ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్‌గా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ప్రమాణస్వీకారం

6 Aug, 2021 18:19 IST|Sakshi

సాక్షి, అమరావతి :  ఆంధ్రప్రదేశ్‌ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్‌గా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. క్రీడాశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్.. సిద్దార్ద్ రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్, కర్నూల్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా బైరెడ్డి సిద్దార్ద్ రెడ్డి మాట్లాడుతూ..  ‘‘నాపై నమ్మకంతో ఈ పదవి ఇచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నమ్మకాన్ని నిలబెడతాను. రాష్ట్రంలో క్రీడలను అభివృద్ధి చేస్తాను. నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలకు నా కృతజ్ఞతలు’’ అని అన్నారు.

కాగా,  2019 అసెంబ్లీ ఎన్నికల్లో కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో వైఎస్సార్‌ సీపీ గెలుపునకు బైరెడ్డి కీలక పాత్ర పోషించారు. పాదయాత్ర సమయంలో నందికొట్కూరు ప్రచార సభలో సీఎం జగన్‌ మాట్లాడుతూ.. బైరెడ్డి తన మనసులో ఉన్నాడని, అధికారంలోకి వచ్చాక కచ్చితంగా మంచి ప్రాధాన్యత గల పదవి ఇస్తానని హామీ ఇచ్చారు.  సిద్ధార్థరెడ్డికి నామినేటెడ్‌ పోస్టు.. ఆంధ్రప్రదేశ్‌ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్‌ పదవిని ఇచ్చి హామీ నిలబెట్టుకున్నారు.

మరిన్ని వార్తలు