అమరావతి: గత చంద్రబాబు ప్రభుత్వంలో చేపట్టిన అమరావతి రాజధాని నిర్మాణంపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) సంచలన నివేదిక వెల్లడించింది. సీఆర్‌డీఏతో రాష్ట్రంపై భారీ ఆర్థిక భార పడనుందని, ప్రస్తుతంతో పాటు భవిష్యత్‌లో కూడా ఆర్థిక భారం పడనుందని పేర్కొంది.
అమరావతి నిర్మాణానికి సంబంధించి నిపుణల కమిటీ సిఫార్సులను అప్పటి చంద్రబాబు సర్కారు పరిగణలోకి తీసుకోలేదని స్పష్టం చేసింది. మాస్టర్ ప్లాన్ తయారీ కాంట్రాక్ట్‌లను నామినేషన్ పద్ధతిలో ఇచ్చేశారని తెలిపింది. సలహాదారు సంస్థలకు నామినేషన్లపై రూ. 28 కోట్లు ఇవ్వడాన్ని కాగ్ తప్పుబట్టింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రజా వేదిక నిర్మాణం జరిగిందని పేర్కొంది.