ధన్యవాదాలు ఎమ్మెల్సీ గారూ: సుశీలమ్మ

9 Aug, 2020 07:25 IST|Sakshi

సాక్షి, హిందూపురం: ‘సర్వైకల్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న నాకు హైదరాబాద్‌లో శస్త్రచికిత్స చేయించి ప్రాణభిక్ష పెట్టిన మీకు ధన్యవాదాలు సార్‌’ అంటూ ఎమ్మెల్సీ మహమ్మద్‌ ఇక్బాల్‌కు హిందూపురంలోని అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన సుశీలమ్మ కృతజ్ఞతలు తెలిపారు. శనివారం తన కుటుంబసభ్యులతో పాలు ఎమ్మెల్సీని ఆమె కలిసి మాట్లాడారు. పేదరికం కారణంగా మెరుగైన చికిత్సలుఇ అందులోని స్థితిలో ఉన్న తన పరిస్థితికి సకాలంలో స్పందించి ప్రభుత్వ పరంగా ఉచితంగా వైద్య సేవలు అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారి వెంట వైఎస్సార్‌సీపీ నాయకులు గోపీకృష్ణ, ఇందాద్, లతీఫ్, రహమత్, సునీల్, మంజునాథ్, సురేష్‌ తదితరులు ఉన్నారు.   (చంద్రబాబూ.. ఇప్పుడేమంటారు?)

మరిన్ని వార్తలు