గంజాయి పంట ధ్వంసం

18 Nov, 2021 05:00 IST|Sakshi
గంజాయి పంటను ధ్వంసం చేస్తున్న గిరిజనులు

స్వచ్ఛందంగా పాల్గొంటున్న  గిరిజనులు

కొయ్యూరు/డుంబ్రిగుడ: విశాఖ ఏజెన్సీ కొయ్యూరు మండలం అంతాడ పంచాయతీ నిమ్మలగొంది, బోయవుట, డుంబ్రిగుడ మండలంలోని కురిడి పంచాయతీ గోరాపూర్‌ గ్రామాల్లో గిరిజనులు బుధవారం  40 ఎకరాల్లో గంజాయి పంటను ధ్వంసం చేశారు. కొయ్యూరు సీఐ స్వామినాయుడు, మంప, కొయ్యూరు, డుంబ్రిగూడ ఎస్‌ఐలు లోకేష్‌కుమార్, దాసరినాగేంద్ర, సంతోష్‌కుమార్‌ బుధవారం ఆయా గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో  ఆ గ్రామాల ప్రజలు ఏకమై 40 ఎకరాల్లో గంజాయి మొక్కలను పీకి పారేశారు. ఇక మీదట గంజాయి తోటలు పెంచబోమని వారు పోలీసులకు  తెలిపారు. సీఐ స్వామినాయుడు మాట్లాడుతూ గిరిజనుల్లో చైతన్యం వచ్చిందని, స్వచ్ఛందంగా వారే గంజాయిని ధ్వంసం చేస్తున్నారని తెలిపారు.  

మరిన్ని వార్తలు