జేసీ దివాకర్‌ రెడ్డిపై కేసు నమోదు

10 Oct, 2020 20:35 IST|Sakshi

సాక్షి, అనంతపురం : మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్‌ నేత జేసీ దివాకర్‌ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులను దూషించిన ఆయనపై 153ఏ, 506 సెక్షన్ల కింద తాడిపత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే అధికారుల అంతు చూస్తానంటూ జేసీ దివాకర్‌ రెడ్డి నిన్న బెదిరింపులకు పాల్పడ్డారు. తాడిపత్రి సీఐ తేజోమూర్తి ఫిర్యాదు మేరకు పోలీసులు నమోదు చేశారు. (దివాకర్ రెడ్డి మైనింగ్ సంస్థలకు నోటీసులు)

 కాగా ‘మా అనుచరులు రాక్షసులు. పచ్చి రక్తం తాగేవాళ్లు నా చుట్టూ ఉన్నారు. వాళ్లు మీ రక్తాన్ని పులి, సింహాల్లాగా తాగుతారు.’’ అని దివాకర్‌రెడ్డి అధికారులను బెదిరించే ధోరణిలో వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మమ్మల్ని అధికారులు సన్మానిస్తే, మేము అధికారంలోకి వచ్చాక వారిని రెట్టింపు స్థాయిలో సన్మానిస్తాం అంటూ తాడిపత్రిలోని భూగర్భ గనుల శాఖ కార్యాలయం వద్ద ధర్నా చేయడానికి వచ్చిన ఆయన వ్యంగ్యంగా హెచ్చరించారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు